చీకోటి ప్రవీణ్ ,మాధవరెడ్డి ఇళ్లలో ముగిసిన ఈడీ సోదాలు: లాప్ టాప్, మొబైల్ సీజ్

By narsimha lode  |  First Published Jul 28, 2022, 9:35 AM IST

కేసీనో నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ , మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి. నిన్నటి నుండి ఈడీ అధికారులు వీరిద్దరి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. సుమారు 20 గంటల పాటు సోదాలు చేశారు. ప్రవీణ్ ఇంటి నుండి లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. 
 


హైదరాబాద్: Casino నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న Chikoti Praveen, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి. గురువారం నాడు తెల్లవారుజాము వరకు  ఈ సోదాలు కొనసాగాయి.  బుధవారం నాడు ఉదయం నుండి  గురువారం నాడు తెల్లవారుజాము వరకు కూడా సోదాలు కొనసాగాయి. సుమారు 20 గంటల పాటు  ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  చీకోటి ప్రవీణ్ ఇంటి నుండి లాప్ టాప్ లు , మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.  హావాలా మార్గంలో విదేశాలకు డబ్బులను ప్రవీణ్  తరలించారా అనే కోణంలో ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ కుమార్  ఇంటి నుండి స్వాధీనం చేసుకొన్న లాప్ టాప్ లలో ఉన్న అనుమానాస్పద లావాదేవీల విషయమై Enforcement Directorate అధికారులు ఆరా తీస్తున్నారు.పలువురు ప్రముఖులతో ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

నిన్నటి నుండి ఇవాళ తెల్లవారుజాము వరకు హైద్రాబాద్ లోని సైదాబాద్, సికింద్రాబాద్ లోని బోయినపల్లి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కడ్తాల్ తో సహా ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేసినో నిర్వహించిన ట్టుగా ప్రవీణ్ కుమార్ పై ఆరోపణలున్నాయి. ఏపీ రాష్ట్రంలోని గుడివాడలో కేసినో  విషయమై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ విషయమై టీడీపీ నేతలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు.  గుడివాడలో కేసినో నిర్వహించలేదని ప్రవీణ్ చెప్పారు. తనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మరో వైపు Hyderabad నగర శివారులోని ఓ సినీ నటుడికి చెందిన ఫామ్ హౌస్ లో కేసినో నిర్వహించారనే విషయమై ప్రవీణ్ పై ఆరోపణలు వచ్చాయి.

also read:హైద్రాబాద్‌లో ఈడీ సోదాలు: చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లల్లో సోదాలు

హైద్రాబాద్ నుండి ప్రముఖులను విదేశాలకు తీసుకెళ్లి కేసినో ఆడిస్తున్నాడని  పోలీసులు చెబుతున్నారు.  ఈ ఘటనలకు సంబంధించి చీకోటి ప్రవీణ్ పై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. దరిమిలా నిన్న ప్రవీణ్ ఇంటితో పాటు మాధవరెడ్డి ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు చేశారు.  ఈ నెలలో Mdhava Reddy కేసినో నిర్వహిచారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

నేపాల్ సహా ఇతర దేశాలకు ప్రముఖులను తరలించి కేసినో ఆడించారని అధికారులు గుర్తించారు.  హైద్రాబాద్ నుండి  విదేశాలకు ప్రముఖులను తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ఈడీ అధికారులు గుర్తించారని మీడియా రిపోర్ట్ చేసింది. మరో వైపు  కేసినో నిర్వహించే ప్రాంతంలో డ్యాన్సు ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేసేవారని అధికారులు చెబుతున్నారు . పలువురు సినీ ప్రముఖులతో కూడా వీరికి సంబంధాలున్నాయని కూడా అధికారులు అనుమానిస్తున్నారు. కేసినో కు రావాలని కూడాసినీ తారలతో ప్రచారం చేయించినట్టుగా అధికారులు గుర్తించారు. 

click me!