నలుగురు బిడ్డల తల్లి.. 15యేళ్ల బాలుడితో జంప్.. వివాహేతర సంబంధం కోసం దారుణం, చివరకు...

By SumaBala Bukka  |  First Published Jul 28, 2022, 9:24 AM IST

నలుగురు పిల్లల తల్లైన.. ముప్పైయేళ్ల ఓ వివాహిత.. పదిహేనేళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడిని తీసుకుని హైదరాబాద్ కు పారిపోయింది. చివరకు పోలీసులు అరెస్ట్ చేసి..ఆమెను రిమాండ్ కు పంపారు. 


గుడివాడ : ఎదురింటి బాలుడుని తీసుకొని పారిపోయిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కృష్ణాజిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. గుడివాడ గుడ్ మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న (30) తన ఎదురింట్లో ఉండే బాలుడి(15)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నెల 19న ఆ బాలుడితో  పరార్ అయింది. బాలుడి తండ్రి గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్వప్న, బాలుడు హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిద్దరినీ గుడివాడకు తీసుకువచ్చారు. మహిళను బుధవారం గుడివాడ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు.  బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు.

అయితే, ఆ మహిళ నలుగురు బిడ్డల తల్లి.. వయసు 30 ఏళ్లు.. ఇంటి ఎదురుగా ఉన్న 15 ఏళ్ల బాలుడు మీద కన్ను వేసింది. మాయమాటలు చెప్పి పోర్న్ వీడియోలు చూపించింది. అతడిని శారీరకంగా లొంగదీసుకుంది. విషయం బయటకు తెలిస్తే తమ సంబంధానికి ఇబ్బంది అని గుర్తించింది. ఆ బాలుడిని తీసుకుని హైదరాబాద్కు వచ్చింది. ఇక్కడ ఆ బాలుడు తో సహజీవనం మొదలుపెట్టింది.  బాలుడికి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన గుడివాడ టూ టౌన్ పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఈ కేసును ఛేదించారు.

Latest Videos

వైజాగ్ సాయిప్రియ మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్: బెంగళూరులో ప్రియుడితో పెళ్లి, తాళిబొట్టుతో పేరెంట్స్‌కు ఫోటో

హైదరాబాద్ లోని బాలానగర్ లో ఉన్నట్లు గుర్తించి వారిద్దరిని గుడివాడ తీసుకెళ్లారు. కేసు వివరాలను టూ టౌన్ సిఐ వి. దుర్గారావు బుధవారం వెల్లడించారు. కృష్ణాజిల్లా గుడివాడలోని గుడ్ మన్ పేటకు చెందిన వివాహిత స్వప్న (30)కు నలుగురు పిల్లలు ఉన్నారు.  భర్తకు అనారోగ్య సమస్యలు ఉండడంతో వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉండే 15 ఏళ్ల బాలుడితో స్వప్న చనువుగా ఉండేది. ఫోన్ లో నీలిచిత్రాలు చూపించేది.. అలా అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంది. అలా ఈ వ్యవహారం గుట్టుగా నెల రోజుల పాటు సాగింది. 

అయితే ఈ విషయం ఎవరికైనా తెలిస్తే.. బాలుడు తనకు దూరమవుతోందని భావించిన స్వప్న పిల్లలు, భర్తను వదిలేసి ఈనెల 19న అతడిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. బాల నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సీఐ వి దుర్గారావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి ఎదురింట్లో ఉండే మహిళనే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించుకున్నారు.  సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు హైదరాబాదులో ఉన్నారా అని గుర్తించి ఇక్కడికి వచ్చి వారిని తీసుకువెళ్లారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వప్న పై పోక్సో చట్టం తో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. 

click me!