అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు: స్వీట్లు తినిపించుకున్న పల్లా,ముత్తిరెడ్డి

By narsimha lodeFirst Published Oct 11, 2023, 5:19 PM IST
Highlights

పల్లా రాజేశ్వర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటితో గెలిపిస్తామని జనగామ ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరెడ్డి బీఆర్ఎస్ నాయకత్వానికి హామీ ఇచ్చారు.  ఇవాళ బీఆర్ఎస్ సమావేశంలో  పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి స్వీట్లు తినిపించుకున్నారు.

హైదరాబాద్: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. బుధవారంనాడు  జనగామలో జరిగిన  బీఆర్ఎస్ సమావేశంలో  వీరిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.  జనగామ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని  సిట్టింగ్  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  పార్టీ శ్రేణులను కోరారు.  జనగామ అసెంబ్లీ స్థానం నుండి  పల్లా రాజేశ్వర్ రెడ్డిని  లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి  హామీ ఇచ్చారు.

జనగామ అసెంబ్లీ టిక్కెట్టు కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డి,  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని  పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకత్వం  టిక్కెట్టు కేటాయించింది.  జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలతో  పల్లా రాజేశ్వర్ రెడ్డి గత కొంత కాలంగా  సమావేశాలు నిర్వహిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి పోటీగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడ  కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.టిక్కెట్టు తనకే దక్కుతుందని యాదగిరెడ్డి  ధీమాతో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించిన  115 మంది అభ్యర్థుల జాబితాలో  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు లేదు.  బీఆర్ఎస్ ప్రకటించకుండా నాలుగు స్థానాల్లో  జనగామ స్థానం కూడ ఉంది.

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆర్టీసీ చైర్ పర్సన్ పదవిని కేటాయించారు. ఇటీవలనే ఆర్టీసీ చైర్ పర్సన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  బాధ్యతలు చేపట్టారు.నిన్న  తెలంగాణ మంత్రి కేటీఆర్  పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కోరారు.ఇవాళ  జనగామలో  నిర్వహించిన  బీఆర్ఎస్ సమావేశానికి మంత్రులు హరీష్ రావు,  ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడ హాజరయ్యారు.

also read:పల్లా,ముత్తిరెడ్డితో భేటీ: జనగామలో పల్లాను గెలిపించాలన్న కేటీఆర్

ఈ సమావేశంలో  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు.  ఈ సమయంలో  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాళ్లను మొక్కేందుకు  పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రయత్నించారు.అయితే  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అడ్డుకున్నారు.

click me!