యాదాద్రికి 300 మంది ఓటర్లు, వారితో ప్రమాణాలు... ఈసీ సీరియస్‌, టీఆర్ఎస్ నేతలపై చర్యలకు ఆదేశం

Siva Kodati |  
Published : Oct 21, 2022, 09:22 PM IST
యాదాద్రికి 300 మంది ఓటర్లు, వారితో ప్రమాణాలు... ఈసీ సీరియస్‌, టీఆర్ఎస్ నేతలపై చర్యలకు ఆదేశం

సారాంశం

మునుగోడు ఉపఎన్నికల వేళ యాదాద్రిలో టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంపై ఈసీ సీరియస్ అయ్యింది. యాదాద్రిలో 300 మంది ఓటర్లకు దర్శనాలు, వారితో ప్రమాణాలు చేయించిన నేతలపై చర్యలకు ఆదేశించింది. 

మునుగోడు ఉపఎన్నిక వేళ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఓటర్లతో ప్రమాణం చేయించడంపై ఎన్నికల కమీషన్ సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. మునుగోడు నియోజకవర్గానికి చెందిన 300 మందిని బస్సుల్లో తీసుకెళ్లారని ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టింది. యాదాద్రి దర్శనాలు, ఓటర్లతో ప్రమాణం చేయించడాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఫోటోలు, వీడియో సాక్ష్యాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. 300 మంది ఓటర్లకు ఆలయ దర్శనం కోసం చేసిన ఖర్చును అభ్యర్ధి ఖాతాలో పొందుపరచాలని ఆదేశించింది ఈసీ. 

అంతకుముందు మునుగోడు ఉపఎన్నిక ఏర్పాట్లలో లోపాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. షిప్‌కు బదులుగా మరో గుర్తును ముద్రించిన అధికారిపై వేటు వేశారు. మండల రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేస్తూ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు చేశారు. అలాగే బ్యాలెట్ పత్రాల ముద్రణ పనిలో వున్న ఇతర అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Also REad:మునుగోడు ఉపఎన్నిక ఏర్పాట్లలో లోపాలు.. ఈసీ సీరియస్, మరో అధికారిపై వేటు

ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడ  ఆర్డో వో  రోహిత్ సింగ్ కు రిటర్నింగ్ అధికారి బాధ్యతలను కేటాయించింది ఈసీ. పోటీలో ఉన్న అభ్యర్ధులకు గుర్తుల  కేటాయింపులో  మునుగోడు రిటర్నింగ్  అధికారి వ్యవహరించిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ నెల 17న అభ్యర్ధులకు గుర్తుల కేటాయించాల్సి ఉంది. అయితే  కొన్ని గుర్తులపై ఈసికి టీఆర్ఎస్  ఫిర్యాదు చేసింది.దీనికి తోడు  హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ కారణాలతో గుర్తుల కేటాయింపును ఈ నెల 18న చేసినట్టుగా  రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు మీడియాకు చెప్పారు. కారు గుర్తును పోలిన కొన్ని గుర్తులపై ఈసీఐ  గతంలోనే  ఇచ్చిన ఆదేశాల  ఆధారంగా రోడ్డు రోలర్  గుర్తును శివకుమార్ కు కేటాయించలేదని రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు. 

గుర్తుల కేటాయింపు సమయంలో రోడ్డు రోలర్ గుర్తు యుగతులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ కు లాటరీలో దక్కింది. అయితే  ఈ గుర్తును శివకుమార్ కు  కేటాయిస్తున్నట్టుగా తనతో సంతకం కూడా  తీసుకున్నారని ఆయన చెప్పారు. అయితే  తనకు ఈ గుర్తు కాకుండా మరో గుర్తును కేటాయించారన్నారు. ఈ విషయమై  శివకుమార్ ఈసీఐకి పిర్యాదు చేశారు.  దీంతో కేంద్ర ఎన్నికల డిప్యూటీ  కమిషనర్  హైద్రాబాద్ కువచ్చారు. ఈ విషయమై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ కు శివకుమార్ సహా  మరికొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో విచారణ నిర్వహించిన ఈసీ శివకుమార్ కు  రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu