మునుగోడు ఉపఎన్నిక ఏర్పాట్లలో లోపాలు.. ఈసీ సీరియస్, మరో అధికారిపై వేటు

By Siva KodatiFirst Published Oct 21, 2022, 8:33 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నిక ఏర్పాట్లలో లోపాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. షిప్‌కు బదులుగా మరో గుర్తును ముద్రించిన అధికారిపై వేటు వేశారు. మండల రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేస్తూ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు చేశారు. 

మునుగోడు ఉపఎన్నిక ఏర్పాట్లలో లోపాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. షిప్‌కు బదులుగా మరో గుర్తును ముద్రించిన అధికారిపై వేటు వేశారు. మండల రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేస్తూ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు చేశారు. అలాగే బ్యాలెట్ పత్రాల ముద్రణ పనిలో వున్న ఇతర అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడ  ఆర్డో వో  రోహిత్ సింగ్ కు రిటర్నింగ్ అధికారి బాధ్యతలను కేటాయించింది ఈసీ. పోటీలో ఉన్న అభ్యర్ధులకు గుర్తుల  కేటాయింపులో  మునుగోడు రిటర్నింగ్  అధికారి వ్యవహరించిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ నెల 17న అభ్యర్ధులకు గుర్తుల కేటాయించాల్సి ఉంది. అయితే  కొన్ని గుర్తులపై ఈసికి టీఆర్ఎస్  ఫిర్యాదు చేసింది.దీనికి తోడు  హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ కారణాలతో గుర్తుల కేటాయింపును ఈ నెల 18న చేసినట్టుగా  రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు మీడియాకు చెప్పారు. కారు గుర్తును పోలిన కొన్ని గుర్తులపై ఈసీఐ  గతంలోనే  ఇచ్చిన ఆదేశాల  ఆధారంగా రోడ్డు రోలర్  గుర్తును శివకుమార్ కు కేటాయించలేదని రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు. 

ALso REad:మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై వేటు:మిర్యాలగూడ ఆర్డీఓకు ఆర్ఓ బాధ్యతలు

గుర్తుల కేటాయింపు సమయంలో రోడ్డు రోలర్ గుర్తు యుగతులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ కు లాటరీలో దక్కింది. అయితే  ఈ గుర్తును శివకుమార్ కు  కేటాయిస్తున్నట్టుగా తనతో సంతకం కూడా  తీసుకున్నారని ఆయన చెప్పారు. అయితే  తనకు ఈ గుర్తు కాకుండా మరో గుర్తును కేటాయించారన్నారు. ఈ విషయమై  శివకుమార్ ఈసీఐకి పిర్యాదు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల డిప్యూటీ  కమిషనర్  హైద్రాబాద్ కువచ్చారు. ఈ విషయమై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ కు శివకుమార్ సహా  మరికొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో విచారణ నిర్వహించిన ఈసీ శివకుమార్ కు  రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయమై కేంద్ర  ఎన్నికల  డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ గురువారంనాడు  విచారణ  నిర్వహించారు.గుర్తుల  కేటాయింపు  విషయమై ఏం జరిగిందనే దానిపై ఆర్ఓను విచారించారు. ఎన్నికల డిప్యూటీ కమిషనర్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం  చెప్పినట్టుగా  రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు మీడియాకు వివరించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో  విచారణ  చేసిన  తర్వాత కొత్త రిటర్నింగ్  అధికారి నియామకం కోసం  ముగ్గురు అధికారుల పేర్లను పంపాలని  ఈసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.రాష్ట్ర  ప్రభుత్వం పంపిన ముగ్గురి పేర్లలో మిర్యాలగూడ ఆర్ డీ ఓ రోహిత్ సింగ్ కు రిటర్నింగ్ బాధ్యతలను అప్పగించారు

click me!