కాంగ్రెస్‌ను చంపడానికి సుపారీ తీసుకున్నదెవరు... ముందు తేల్చండి : రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి గరం

By Siva KodatiFirst Published Oct 21, 2022, 7:49 PM IST
Highlights

కాంగ్రెస్‌ను చంపడానికి సీఎం కేసీఆర్ సుపారీ తీసుకున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం వాడివేడిగా జరుగుతోంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గరం అయ్యారు. కాంగ్రెస్‌ను చంపడానికి సీఎం కేసీఆర్ ఎవరికి సుపారీ ఇచ్చారన్నది ముందు తేలాలన్నారు జగ్గారెడ్డి. అది తేలిన తర్వాతే మిగతా విషయాలు చర్చిద్దామన్నారు ఆయన. అయితే జగ్గారెడ్డిని మరో సీనియర్ నేత వారించినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత ఇవన్నీ మాట్లాడదామన్నారు. కాంగ్రెస్‌ను చంపడానికి సుపారీ తీసుకుంది జగ్గారెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా అంటూ ఫైరయ్యారు జగ్గారెడ్డి. అలాగే ఏఐసీసీ కార్యదర్శి నవీన్ జావెద్‌ను నిలదీశారు. 

ALso Read:మునుగోడు బైపోల్ : రేవంత్ రెడ్డి కంట కన్నీరు.. తనను ఒంటరి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన..

అంతకుముందు కాంగ్రెస్‌లో తనను ఒంటరి చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారంలో మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు పీసిసి పదవి వచ్చినందుకు సీనియర్ నాయకులు కక్ష పెంచుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా.. అందరూ అప్రమత్తం కావాలి. మునుగోడులో పెద్ద కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులను చిత్తు చేసేందుకు, పార్టీని బతికించుకునేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలి. నేను కూడా పోలీసు తూటాలకు సైతం ఎదురు నిలబడతా…’అని పేర్కొన్నారు. 

పీసీసీ పదవి నుంచి తొలగించేందుకు :

దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు సీఎం కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకోసం పదిరోజులపాటు ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో రహస్య భేటీలు జరిపారన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తనను తొలగించాలనే కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ పేర్కొన్నారు. తనకు పదవులు అవసరం లేదని, పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పారు. తనకు పీసీసీ పదవి వచ్చిననాటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనేక ఒత్తిళ్లు చేస్తున్నాయన్నారు.

నిర్వాసితులను నిరాశ్రయులను చేశారు: 

తాతలు, ముత్తాతల నుంచి వస్తున్న తరతరాల ఆస్తిని రిజర్వాయర్ పేరుతో కాజేసి కేసీఆర్ భూనిర్వాసితులను పూర్తిగా నిరాశ్రయులను చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలోని కుదాభక్టపల్లి, రాంరెడ్డిపల్లి, మర్రిగూడలలో గురువారం రాత్రి జరిగిన రోడ్ షోలలోఆయన మాట్లాడారు. ఇక పాల్వాయి గోవర్థన్ రెడ్డి బిడ్డగా, మీ ఆడబిడ్డగా నన్ను గెలిపించాలని కొంగుచాచి అడుగుతున్నానని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి ఓటర్లను వేడుకున్నారు. 

click me!