
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనిలో భాగంగా శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ముగ్గురు సభ్యుల ఈసీ బృందం వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో ఈసీ బృందం భేటీ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని ఈసీ బృందం సూచించింది. ఆర్‌వోలు మే 1 నుంచి ఈవీఎంలను తనిఖీ చేయాలని.. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజుల పాటు వర్క్ షాపు నిర్వహించాలని సీఈసీ అధికారులు సూచించారు. అలాగే పోలింగ్ శాతం పెంచే కార్యక్రమాలపై సీఈసీ సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.