మునుగోడు ఉపఎన్నిక... జగదీశ్ రెడ్డిపై ఈసీ కన్నెర్ర, 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం

By Siva KodatiFirst Published Oct 29, 2022, 7:39 PM IST
Highlights

టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడులో ప్రచారం నిర్వహించకుండా ఆయనపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను ఈసీ శుక్రవారం ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్ రెడ్డిపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. మునుగోడులో ప్రచారం నిర్వహించకుండా ఆయనపై నిషేధం విధించింది. 48 గంటల పాటు ప్రచారం నిర్వహించకుండా ఆయనపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను ఈసీ శుక్రవారం ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. టీఆర్ఎస్‌కు ఓటు వేయకుంటే పథకాలు ఆగిపోతాయని అన్నట్లు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మునుగోడులో ప్రచారం, ర్యాలీ, సభల్లో పాల్గొనరాదని ఆంక్షలు విధించింది. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 48 గంటల పాటు జగదీశ్ రెడ్డిపై నిషేధం విధించింది. 

click me!