భూదందా కోసమే ధరణీ పోర్టల్ : కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు

Siva Kodati |  
Published : Oct 29, 2022, 06:58 PM IST
భూదందా కోసమే ధరణీ పోర్టల్ : కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు

సారాంశం

తెలంగాణలో భూదందా కోసమే ధరణీ పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.  భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చేరుకుంది. 

బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చేరుకుంది. ఆ సందర్భంగా జడ్చర్ల జంక్షన్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్ధతు పలికిందని ఎద్దేవా చేశారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ... దేశాన్ని బలహీనపరుస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ ఏం చేస్తోందో.. ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. 

రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యాపారులతో మాట్లాడుతున్నానని.. తెలంగాణలో వాస్తవ పరిస్ధితుల్ని, వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని...జీఎస్టీ కారణంగా చేనేత కార్మికులు ఎంతో నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు అండగా కాంగ్రెస్ నిలబడుతుందని.. చేనేత కార్మికులకు జీఎస్టీ కష్టాలను తొలగిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. విద్యార్ధులకు చదువు భారమవుతోందని, నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read:కేసీఆర్ డైలీ ధరణి పోర్టల్‌ని చూస్తారు.. ఎందుకో తెలుసా : రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

విద్యా వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం తక్కువగా ఖర్చు పెడుతోందని.. మన ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థకు ఎక్కువగా నిధులు కేటాయిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనదేశ చరిత్రకు సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలోని బడా వ్యాపారులకే బీజేపీ కొమ్ముకాస్తోందని .. జీఎస్టీతో చిన్న వ్యాపారుల్ని చావు దెబ్బకొట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు రాజకీయ పార్టీలు కాదని.. వ్యాపార పార్టీలన్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం భూదందా చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యంపై ఎక్కువ నిధులు కేటాయిస్తామని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

ఇకపోతే..  శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్‌ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈరోజు 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం ధర్మాపూర్ నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర ఉత్సహంగా ముందుగా సాగుతుంది. పలువురు కాంగ్రెస్ నాయకులు, భారీగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో కలిస నడుస్తున్నారు. 

రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలోకి ప్రవేశించిన సమయంలో.. లంబాడ కళారూపాలతో ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి రాహుల్ సంప్రదాయ నృత్యం చేశారు. ఎమ్మెల్యే సీతక్క, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రాహుల్‌తో కలిసి కాలు కదిపారు. ఇక, పాదయాత్ర చేస్తున్న సమయంలో.. సమస్యలపై ప్లకార్డులు చూపిస్తున్న వారివద్దకు రాహుల్ గాంధీ వెళ్లారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక, పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులతో కూడా రాహుల్ గాంధీ ముచ్చటించారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.