దుబ్బాక బైపోల్: ప్రత్యేక పరిశీలకుడిగా సరోజ్‌కుమార్ నియామకం

By narsimha lodeFirst Published Oct 28, 2020, 4:01 PM IST
Highlights

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ను  ఎన్నికల సంఘం నియమించింది.


దుబ్బాక:దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ను  ఎన్నికల సంఘం నియమించింది.

ఈ నెల 26వ తేదీన సిద్దిపేటలో పోలీసుల సోదాల సమయంలో అంజన్ రావు అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు రూ. 18 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయమై  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం సాగుతోంది.

also read:దుబ్బాక బైపోల్: తటస్థంగా ఉండాలని సీపీఐ నిర్ణయం, కానీ ట్విస్ట్ ఇదీ...

ఈ విషయమై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన విషయం తెలిసిందే.ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం ప్రత్యేక పరిశీలకుడిగా సరోజ్ కుమార్ ను నియమించింది. 

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అనారోగ్య కారణంగా సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత్, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీలో నిలిచారు. 

click me!