మోగిన ఎన్నికల నగారా: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

By narsimha lode  |  First Published Feb 11, 2021, 1:34 PM IST

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ గురువారం నాడు విడుదల చేసింది.


న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ గురువారం నాడు విడుదల చేసింది.ఏపీ రాష్ట్రంలోని రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.తూర్పు-పశ్చిమ గోదావరి టీచర్స్ స్థానం నుండి రాము సూర్యారావు, కృష్ణా-గుంటూరు టీచర్స్ స్థానం నుండి ఎ.ఎస్. రామకృష్ణ ఈ ఏడాది మార్చి 29న రిటైర్ కానున్నారు.

తెలంగాణలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైద్రాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుండి రామచంద్రరావు ఈ ఏడాది మార్చి 29వ తేదీన రిటైర్ కానున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి మార్చి 29న రిటైర్ కానున్నారు.

Latest Videos

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది ఈసీ.ఈ నెల 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేష్లను స్వీకరించనున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.

నామినేషన్ల స్కృూట్నీని ఈ నెల 24వ తేదీ. ఈ నెల 26వ తేదీన నామినేషన్ల ఉపసంహారణకు చివరి తేదీ.మార్చి 14వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.  ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.మార్చి 22వ తేదీలోపుగా  ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది.
 

click me!