అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రస్థానం

By narsimha lodeFirst Published Feb 11, 2021, 1:16 PM IST
Highlights

అమెరికాలో ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీలో పనిచేసిన గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కొత్త మేయర్ గా గురువారం నాడు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కూతురే గద్వాల విజయలక్ష్మి.

 

హైదరాబాద్: అమెరికాలో ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీలో పనిచేసిన గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కొత్త మేయర్ గా గురువారం నాడు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కూతురే గద్వాల విజయలక్ష్మి.

హైద్రాబాద్‌లోని హోలీ మేరీ స్కూల్ లో ఆమె విద్యాభ్యాసం పూర్తైంది. రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఆమె విద్యను అభ్యసించారు. భారతీయ విద్యాభవన్ లో ఆమె జర్నలిజం పూర్తి చేశారు. సుల్తాన్ ఉలుం లా కాలేజీలో ఆమె ఎల్ఎల్‌బీని పూర్తి చేశారు. 

also read:జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక: టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు

బాబీ రెడ్డిని ఆమె వివాహం చేసుకొన్నారు. 18 ఏళ్ల పాటు ఆమె అమెరికాలో నివసించింది. అమెరికాలోని నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్శిటీలో ఆమె పనిచేసింది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో ఇది ఒకటి.

2007లో గద్వాల విజయలక్ష్మి అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చింది. యూఎస్ సిటిజన్ షిప్ ను ఆమె వదులుకొంది. 2016 లో జూబ్లీహిల్స్ కార్పోరేటర్ గా ఆమె పోటీ చేసి విజయం సాధించింది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుండి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. బంజారాహిల్స్ కార్పోరేటర్ గా అనేక అభివృద్ది కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.

click me!