జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక: టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు

By narsimha lodeFirst Published Feb 11, 2021, 12:40 PM IST
Highlights

: జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలు ఎన్నికయ్యారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలు ఎన్నికయ్యారు.గురువారం నాడు మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికల అధికారి శ్వేత మహంతి మేయర్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.

మేయర్ ఎన్నికను ప్రారంభిస్తున్నట్టుగా శ్వేత మహంతి ప్రకటించారు. ఎన్నికల అధికారి ప్రకటన చేసిన వెంటనే మాజీ జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్  ఫసియుద్దీన్ గద్వాల విజయలక్ష్మి పేరును ప్రతిపాదించారు. ఈ పేరును టీఆర్ఎస్ పార్టీకి చెందిన గాజుల రామారం  కార్పోరేటర్ గద్వాల విజయలక్ష్మి పేరును ప్రతిపాదించారు.

also read:ముగిసిన జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల ప్రమాణస్వీకారం: సామూహిక ప్రమాణం

ఆ తర్వాత జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్ధి కోసం బీజేపీ తరపున కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి  వీరన్నగారి రాధా( రాధా ధీరజ్ రెడ్డి) పేరును ప్రతిపాదించారు.  మరో బీజేపీ కార్పోరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పేరును ప్రతిపాదించారు.

మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయలేదు.  టీఆర్ఎస్, బీజేపీలు మాత్రమే పోటీ చేశారు.తొలుత బీజేపీ అభ్యర్ధి రాధా ధీరజ్ రెడ్డికి నమోదైన ఓట్లను అధికారులు లెక్కించారు. ఆ తర్వాత గద్వాల విజయలక్ష్మికి టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు మద్దతు ప్రకటించారు.

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక పూర్తైన తర్వాత డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికను నిర్వహించారు. మచ్చ బొల్లారానికి చెందిన టీఆర్ఎస్ కార్పోరేటర్  మోతె శ్రీలత శోభన్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. కూకట్‌పల్లి డివిజన్ కు చెందిన టీఆర్ఎస్ కార్పోరేటర్ సత్యనారాయణ బలపర్చారు. 

బీజేపీకి చెందిన శంకర్ యాదవ్ పేరును డిప్యూటీ మేయర్ పదవికి రాకేష్ జైశ్వాల్ అనే మరో బీజేపీ కార్పోరేటర్ ప్రతిపాదించారు. బీజేపీకి చెందిన అడిక్ మెట్ కార్పోరేటర్  శంకర్ యాదవ్ పేరును బలపర్చారు.

తొలుత శంకర్ యాదవ్ కు వచ్చిన ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఓట్లను లెక్కించారు.  డిప్యూటీ మేయర్ ఎన్నికకు కూడ ఎంఐఎం టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది.మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో బీజేపీ సభ్యులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నేతలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
 

click me!