మాదాపూర్ భారీగా పేకాట దందా... పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మహిళలు... ఎమ్మెల్యే?

Arun Kumar P   | Asianet News
Published : Mar 01, 2022, 09:56 AM ISTUpdated : Mar 01, 2022, 10:07 AM IST
మాదాపూర్ భారీగా పేకాట దందా... పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మహిళలు... ఎమ్మెల్యే?

సారాంశం

తెలంగాణ రాజధాని  హైదరాబాద్ లో సంపన్నులు నివాసముండే మాదాపూర్ లోని ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ భారీస్థాయిలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసారు.వీరిలో ముగ్గురు మహిళలు కూడా వున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో సంపన్నులుండే ప్రాంతాలనే టార్గెట్ గా చేసుకుని పేకాట దందా (playing cards) సాగిస్తున్నాయి కొన్ని ముఠాలు. పోలీసులకు అనుమానం రాకుండా సంపన్నులు నివాసముండే ఖరీదైన అపార్టుమెట్స్ లను పేకాట స్థావరాలుగా మారుస్తున్నాసరు. ఇలా తాజాగా మాదాపూర్ లోని  ఓ అపార్ట్ మెంట్ లో పేకాట ఆడుతున్న బడాబాబులు, ముగ్గురు మహిళలు ఎస్వోటి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిలో ఓ ఎమ్మెల్యే కూడా వున్నట్లు సమాచారం.

మాదాపూర్ (madhapur) కాకతీయ హిల్స్ లో భారీస్థాయిలో పేకాట దందా నడుస్తున్నట్లు పోలీసుకలు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో స్థానిక డిసిపి నేతృత్వంలో ఎస్వోటి (SOT) బృందం సదరు అపార్ట్ మెంట్ లో దాడిచేసారు. దీంతో ఓ అపార్ట్ మెంట్ లో పేకాట ఆడుతున్నకొందరు రెడ్ హ్యాండెెడ్ గా పట్టుబడ్డారు.

అయితే పోలీసులకు చిక్కిన వారిలో ముగ్గురు మహిళలతో పాటు ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం తొమ్మిదిమంది పట్టుబడగా పోలీసులు సదరు ఎమ్మెల్యేను వదిలేసి మిగతా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.90 లక్షల  నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొబైల్స్, ఖరీదైన మందు బాటిల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అయితే ఈ దాడిలో పాల్గొన్న మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రసాద్ మాత్రం ఎమ్మెల్యే పట్టుబడినట్లు ప్రచారాన్ని ఖండించారు. ప్రజాప్రతినిధులెవ్వరూ పట్టుబడలేదని... ఎవ్వరినీ తాము విడిచిపెట్టలేదని తెలిపారు. రోడ్ నెంబర్ 6లోని కాకతీయ హిల్స్ లోని వి.శ్రీనివాస్ రావుకు చెందిన ప్లాట్ లో భారీస్థాయిలో పేకాట దందా సాగుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో గోవర్ధన్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, తుమ్మల శ్రీకాంత్ తో పాటు సౌజన్య, వసంత, వందన పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో సినీ నటుడు నాగశౌర్య కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో పేకాట దందా బయటడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. 

గత ఏడాది అక్టోబర్ 31న రాత్రి మంచిరేవులలోని హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నవిషయమై సమాచారం అందుకొన్న పోలీసులు దాడులు చేశారు.  ప్రధాన నిందితుడు సుమన్ సహా 30 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుమన్ తో కలిసి శివలింగప్రసాద్ ఈ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో శివలింగ ప్రసాద్  పోలీసులు అరెస్ట్ చేసారు.

 ఈ ఫామ్ హౌస్ లో పేకాట  ఆడుతున్నారని కచ్చితమైన సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య సహా పలువురు  పోలీసులకు చిక్కారు. గుత్తా సుమన్ కుమార్ ఈ పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు, వీఐపీలు, రాజకీయ నేతలతో సుమన్ కు సంబంధాలున్నాయని  దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 

పేకాట ఆడేవారి కోసం సుమన్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పేకాట ఎక్కడ ఆడుతారోననే విషయమై సుమన్ కుమార్ సమాచారం చేరవేసేవాడు. డిజిటల్ రూపంలో డబ్బులను తీసుకొనేవాడు. ఈ డబ్బులను తీసుకొన్న తర్వాత సుమన్ కుమార్ కాయిన్స్ ను ఇచ్చేవాడని పోలీసులు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్