హైద్రాబాద్ శ్రీకృష్ణ జ్యూవెలర్స్ సంస్థలో ఈడీ సోదాలు

By narsimha lodeFirst Published Oct 7, 2021, 11:10 AM IST
Highlights

హైద్రాబాద్ శ్రీకృష్ణ జ్యూయలరీస్ సంస్థపై గురువారం నాడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మనీల్యాండరింగ్ పాల్పడినట్టుగా తేలడంతో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సంస్థపై సీసీఎస్ లో గతంలోనే కేసు నమోదైంది.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని శ్రీకృష్ణ జ్యువెలర్స్ లో గురువారం నాడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్టుగా గుర్తించిన ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.sri krishna jewellers సంస్థపై హైద్రాబాద్ సీసీఎస్ లో గతంలోనే కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా enforcement directorte అధికాులు రంగంోకి దిగారు.

also read:అక్రమంగా బంగారం కొనుగోలు..శ్రీకృష్ణ జ్యూయెలర్స్ ఎండీ అరెస్ట్

హైద్రాబాద్ నగరంలోని శ్రీకృష్ణ జ్యువెలర్స్ లో గురువారం నాడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్టుగా గుర్తించిన ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు pic.twitter.com/qdM4yqx5jB

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఇవాళ ఉదయం నుండి శ్రీకృష్ణ జ్యువెలర్స్ సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ సహా 12 చోట్ల తనిఖీలు చేస్తున్నారు అధికారులు. 

శ్రీకృష్ణ జ్యువెలర్స్ సంస్థ ఎండీ ప్రదీప్ కుమార్ సహా మరో నలుగురిని  2019 మే 7వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పన్నులు ఎగ్గొట్టేందుకు విదేశాల నుండి అక్రమ మార్గంలో బంగారాన్ని కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గతంలో శ్రీకృష్ణ జ్యువెలర్స్ సంస్థపై అభియోగాలు నమోదు చేశారు. 

శ్రీకృష్ణ జ్యువెలర్స్ సంస్థ 1100 కిలో బంగార్ని మళ్లించినట్టుగా dri అధికారులు గతంలో గుర్తించారు. కష్టమ్స్ యాక్ట్ ఉల్లంఘనతో పాటు  ఇతర నిబంధనలను ఉల్లంఘించడంతో ఆ సంస్థపై కేసులు నమోదయ్యాయి.శంషాబాద్ లోని రావిరాల గ్రామంలోని సెజ్ పై డీఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. ఈ నిఘాలో కంపెనీ మోసపూరింగా వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తించారు.

click me!