Huzurabad Bypoll: బిజెపిలో కలకలం... హుజురాబాద్ అధ్యక్షుడిపై వేటు

By Arun Kumar PFirst Published Oct 7, 2021, 10:59 AM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో బిజెపిలో కలకలం రేగింది. హుజురాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడిని తొలగిస్తూ కీలక కరీంనగర్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీలో కలకలం రేగింది. హుజురాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డిని తొలగించారు. ఈ  మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి పేరిట ఓ ప్రకటన వెలువడింది. నూతనంగా హుజురాబాద్ పట్టణ బిజెపి శాఖ కన్వీనర్ గా గంగిశెట్టి ప్రభాకర్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు ప్రకటించారు. 

అయితే తనను పట్టణ అధ్యక్షుడిగా అకారణంగా తొలగించారంటూ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. telangana bjp అధ్యక్షులు బండి సంజయ్ ని కలిసేందుకు మహేందర్ వర్గం ప్రయత్నిస్తోంది. మరికాసేపట్లో కరీంనగర్ లో సంజయ్ ని కలవనున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల హుజురాబాద్ కు చెందిన బిజెపి కౌన్సిలర్ గంగిశెట్టి ఉమామహేశ్వర్ మంత్రి గంగుల సమక్షంలో TRS లో చేరారు. మరో బిజెపి కౌన్సిలర్ ప్రతాప మంజుల ఇప్పటికే  టీఆర్ఎస్ లో చేరారు. ఇలా నలుగురు BJP కౌన్సిలర్లలో ఇద్దరు టీఆర్ఎస్ లో చేరగా మరో ఇద్దరు కూడా చేరడానికి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరు బిజెపి కౌన్సిలర్లు టీఆర్ఎస్ తో టచ్ లో వున్నట్లు... మంతనాలు ముగిసాక వారు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

READ MORE  బతుకమ్మల మీదినుంచి దూసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు, ఉద్రిక్తత..

huzurabad bypoll బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమయంలో ఇలా కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరడం బిజెపి పెద్దల ఆగ్రహానికి కారణమయ్యిందో ఏమో గాని బిజెపి పట్టణ అధ్యక్షుడిపై వేటు పడింది. మహేందర్ రెడ్డి అలసత్వం కారణంగానే కౌన్సిలర్లు చేజారినట్లు భావించారో ఏమోగాని అతడిని హుజురాబాద్ అధ్యక్ష పదవినుండి తొగించింది బిజెపి.  

ఇక హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి గత శుక్రవారం(అక్టోబర్ 1వ తేదీన) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఇదేరోజు నుండి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విద్యార్థిసంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ఇద్దరు కూడా అక్టోబర్ 8నే నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. 
  


  
 

click me!