తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : రేపే నోటిఫికేషన్, వెంటనే నామినేషన్లు షురూ

By Siva Kodati  |  First Published Nov 2, 2023, 8:20 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు కీలక ఘట్టానికి తెరలేవనున్నది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయనుంది. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు కీలక ఘట్టానికి తెరలేవనున్నది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయనుంది. ఇందుకోసం సీఈసీ .. రాష్ట్ర గవర్నర్ అనుమతి కూడా తీసుకుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన పిమ్మట నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా మొదలుకానుంది. 

రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే ఈ నెల 8 నుంచి 10 వరకు మంచి ముహూర్తాలు వుండటంతో అభ్యర్ధులు ఈ రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం వుంది. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఈసీ లెక్కలోకి తీసుకుంటుంది. 

Latest Videos

నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13న నామినేషన్ల పరిశీలన.. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజున ఈసీ అభ్యర్ధుల తుది జాబితాను ప్రకటించనుంది. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మరోవైపు.. ఎన్నికల్లో పోటీ చేసే జనరల్, బీసీ అభ్యర్ధులు రూ.10 వేలు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 5 వేలు డిపాజిట్ చేయాల్సి వుంటుంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధితో పాటు ఐదుగురికి మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్‌ కార్యాలయంలోకి అనుమతిస్తారు. 
 

click me!