
ఈ విస్తరణతో హైదరాబాద్ సాంకేతిక ఆవిష్కరణలలో గ్లోబల్ హబ్‌గా మరింత బలపడుతుందని ఆయన అన్నారు. సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఎగుమతుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అలాగే, విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులతో కూడిన AI యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 200 మంది సిబ్బందితో ఉన్న eAppSys, రాబోయే రెండేళ్లలో వర్క్‌ఫోర్స్‌ను 500 మందికి పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరణలో భాగంగా 400 సీట్ల సామర్థ్యం గల ఆధునిక కార్యాలయం ఏర్పాటు చేసింది. ఇందులో కోలాబొరేటివ్ ఇన్నోవేషన్ పాడ్స్, సెక్యూర్ డెలివరీ జోన్స్, హైబ్రిడ్ వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ సెంటర్ ద్వారా APAC, EMEA, నార్త్ అమెరికా ప్రాంతాల కస్టమర్లకు AI, ఒరాకిల్ క్లౌడ్, ERP, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీసులు అందించనున్నారు.
ఈ సెంటర్ ద్వారా ఒరాకిల్ క్లౌడ్/ERP కన్సల్టెంట్లు, AI/ML ఇంజినీర్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ నిపుణులు వంటి వందలాది అధిక నైపుణ్యాల ఉద్యోగాలు రానున్నాయి. స్థానిక ప్రతిభను పెంపొందించేందుకు అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లలో కూడా eAppSys పెట్టుబడి పెడుతోంది. కంపెనీ డైరెక్టర్ & COO సుజాని రెడ్డి బద్దం మాట్లాడుతూ, "మా లక్ష్యం పరిమాణం పెంచడం మాత్రమే కాదు, ప్రపంచ దృష్టితో ఆలోచించి, స్థానికంగా అమలు చేసే బృందాన్ని తయారు చేయడం" అన్నారు.
యూకే, యూఎస్, యూరప్, మధ్యప్రాచ్యం, APAC ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న eAppSys, భవిష్యత్తు వ్యూహంలో నాలుగు కీలక రంగాలపై దృష్టి పెట్టింది.
ఒరాకిల్ క్లౌడ్ & ERP మోడర్నైజేషన్
AI ఆధారిత మోడల్, ఆటోమేషన్
డేటా అనలిటిక్స్ & స్మార్ట్ ఇన్‌సైట్స్
అజైల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్‌లు
కంపెనీ నాయకత్వ బృందంలో ఒరాకిల్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఉండటం వల్ల గ్లోబల్ స్థాయి పరిష్కారాల అమలులో అనుభవం లభిస్తోంది.
అధిక నైపుణ్యాలు కలిగిన వర్క్‌ఫోర్స్, బలమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్‌కు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, చురుకైన విద్యా & స్టార్ట్‌అప్ వాతావరణం. ఇవి అన్నీ కలిసి హైదరాబాద్‌ను eAppSys APAC ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టాయి. eAppSys, ప్రభుత్వాలు, సంస్థలకు ఒరాకిల్ ఆధారిత ఆధునికీకరణ, క్లౌడ్, AI, ఆటోమేషన్ సొల్యూషన్లను అందిస్తోంది.