KTR: బిగ్‌షాక్‌.. సుప్రీంకోర్టు మెట్లెక్కనున్న కేటీఆర్.. అసలేం జరిగిందంటే?

Published : Aug 09, 2025, 09:16 AM IST
KTR Supreme Court notice

సారాంశం

KTR:సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు కోసం పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఫిరాయింపులపై చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.

KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టు మెట్లెక్కనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్సీలపై దృష్టి సారించింది. ఈ మేరకు శాసనమండలి సభ్యులపై కూడా అదే విధానాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేయబోతున్నారు. ఇటీవల బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ఎగ్గె మల్లేశం, ఎం.ఎస్. ప్రభాకర్, దండె విఠల్, బొగ్గారపు దయానంద్ సహా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

 బీఆర్‌ఎస్ వీరిని నైతికంగా రాజీనామా చేసి, తిరిగి ఎన్నిక గెలుపొందాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌