దుండిగల్ మహిళ హత్య కేసు : రోజుకో అమ్మాయి కావాలంతే... తెస్తావా, వదిలేయమంటావా..

Published : Jul 31, 2021, 07:31 AM IST
దుండిగల్ మహిళ హత్య కేసు : రోజుకో అమ్మాయి కావాలంతే... తెస్తావా, వదిలేయమంటావా..

సారాంశం

నువ్వు ఒక్కదానివే నాకు సరిపోవు. రోజుకో అమ్మాయి కావాలి. తీసుకొస్తే తీసుకురా.. లేదంటే నిన్ను వదిలేస్తా’ అంటూ నన్ను బెదిరించేవాడు. అందుకే అతను చేసే అఘాయిత్యాలకు నేను సహకరించే దాన్ని. ఒప్పుకుంటే లైంగికదాడి చేసేవాడు. ప్రతిఘటిస్తే నరకం చూపించేవాడు. 

హైదరాబాద్ : దుండిగల్ మహిళ హత్య కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో నిందితులు చెబుతున్న విషయాలు పోలీసులను షాకింగ్ కి గురి చేస్తున్నాయి.

‘నువ్వు ఒక్కదానివే నాకు సరిపోవు. రోజుకో అమ్మాయి కావాలి. తీసుకొస్తే తీసుకురా.. లేదంటే నిన్ను వదిలేస్తా’ అంటూ నన్ను బెదిరించేవాడు. అందుకే అతను చేసే అఘాయిత్యాలకు నేను సహకరించే దాన్ని. ఒప్పుకుంటే లైంగికదాడి చేసేవాడు. ప్రతిఘటిస్తే నరకం చూపించేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేయరనుకుంటే వదిలేసే వాడు. ఒకవేళ చేస్తారని అనిపిస్తే అత్యంత కిరాతకంగా చంపేసేవాడు..’ అంటూ తాము చేసిన అకృత్యాల గురించి ఆమె చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు.

దుండిగల్ పోలీసులు అరెస్టు చేసిన కిలాడి జంట నేర చరిత్ర గురించి  తవ్వేకొద్దీ పలు  విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి.  ఈ నెల 25న దుండిగల్ ఠాణా పరిధిలో మహిళ (37)  దారుణ హత్య కేసులో ఐడీఏ బొల్లారం వైయస్సార్ కాలనీలో ఉంటున్న కురువ స్వామి అలియాస్ రవి (32),  మసన మొల్ల నరసమ్మ (30) ను అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు మహిళను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

నర్సమ్మ చెప్పిన విషయాలు.. దారుణంగా ఉన్నాయి. ‘స్వామి ఏ పని చేయడు. విలాసవంతమైన జీవితం కావాలి. లేబర్ అడ్డాలు, మార్కెట్ల దగ్గర అందంగా, ఒంటిపై ఆభరణాలు కనిపించే మహిళలను ట్రాప్ లోకి దించేవాడు. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడి ఆభరణాలతో ఉడాయించేవాడు. ఈ తరహాలోనే తొమ్మిదేళ్ల కిందట  నర్సమ్మ పైనా అఘాయిత్యం చేశాడు.   

భార్య సాయంతో మహిళపై రేప్, హత్య: 11 హత్యలకు పాల్పడిన భార్యాభర్తలు

అలా నర్సమ్మకు స్వామి పరిచయమయ్యాడు. అంతకుముందే ఆమెకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన తరువాత భర్త, పిల్లల్ని వదిలేసి స్వామి తో కొన్నాళ్ళు సహజీవనం చేసింది. తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది.

కొట్టేసిన ఆభరణాలను  కుదువబెట్టి.. ఆ డబ్బుతో 15, 20 రోజులు జల్సా చేసేవారు. మళ్లీ మరో మహిళపై దారుణానికి ఒడిగట్టేవారమని పోలీసులకు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా రెండు నెలలకోసారి మకాం మార్చేవారు. అందుకే ఇంట్లో పెద్దగా సామాను పెట్టుకునే వారు కాదు. వీరి చేతికి చిక్కిన చాలా మంది బాధితులు పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ఫిర్యాదు చేయలేదు. అదే వీరు మరిన్ని దారుణాలకు పాల్పడేలా చేసిందని పోలీసులు చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్