కొత్తగా 614 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,44,330కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Jul 30, 2021, 09:03 PM IST
కొత్తగా 614 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,44,330కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 645 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 657 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 9,141 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,11,251 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 614 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,44,330కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,800కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 657 మంది కోలుకోవడంతో తెలంగాణలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,31,389కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 18, జీహెచ్ఎంసీ 73, జగిత్యాల 37, జనగామ 12, జయశంకర్ భూపాలపల్లి 5, గద్వాల 1, కామారెడ్డి 2, కరీంనగర్ 61, ఖమ్మం 47, మహబూబ్‌నగర్ 8, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 10, మంచిర్యాల 17, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 33, ములుగు 5, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 45, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 6, పెద్దపల్లి 32, సిరిసిల్ల 21, రంగారెడ్డి 30, సిద్దిపేట 15, సంగారెడ్డి 7, సూర్యాపేట 22, వికారాబాద్ 4, వనపర్తి 2, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 59, యాదాద్రి భువనగిరిలో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే