తేల్చేసిన దత్తాత్రేయ: బిజెపిలోకి డిఎస్ ఖాయం, కేసీఆర్ కు షాక్

By telugu teamFirst Published Jul 13, 2019, 2:36 PM IST
Highlights

డీఎస్ ఇటీవల కేంద్ర మంత్రి, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. బిజెపిలో డిఎస్ చేరడానికి సిద్ధపడినట్లు అప్పుడే ప్రచారం మొదలైంది. అయితే, ఆ విషయం స్పష్టం కాలేదు. తాజాగా దత్తాత్రేయ ప్రకటనతో డిఎస్ బిజెపిలోకి వెళ్లడం ఖాయమని తేలిపోయింది.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ బిజెపిలో చేరడం ఖాయమైనట్లే. మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ చేసిన వ్యాఖ్యల ద్వారా ఆ విషయం స్పష్టమైంది. డిఎస్ మాత్రమే కాదు, టీఆర్ఎస్, కాంగ్రెసు ఎంపీలు పలువురు తమ పార్టీలో చేరుతారని ఆయన శనివారం చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. 

డీఎస్ ఇటీవల కేంద్ర మంత్రి, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. బిజెపిలో డిఎస్ చేరడానికి సిద్ధపడినట్లు అప్పుడే ప్రచారం మొదలైంది. అయితే, ఆ విషయం స్పష్టం కాలేదు. తాజాగా దత్తాత్రేయ ప్రకటనతో డిఎస్ బిజెపిలోకి వెళ్లడం ఖాయమని తేలిపోయింది.

గత శాసనసభ ఎన్నికలకు ముందు డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనను సస్పెండ్‌ చేయాలని కేసీఆర్ అనుకున్నారు. సస్పెండ్ చేస్తే ఆయన మరో పార్టీలో చేరతారనే ఉద్దేశంతో చర్య తీసుకోకుండా పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టారు. 

ఆ తర్వాత  ఆయన సోనియాను కలిసినట్లు వార్తలు వచ్చాయి. బుధవారం డీఎస్‌ ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ ఎంపీల సమావేశానికి డిఎస్ హాజరయ్యారు. దీని వెనక డీఎస్‌ వ్యూహం ఏమిటనే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకత్వం పడింది. డీఎస్‌ 2016 జూన్‌లో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2022 వరకు పదవీ కాలం ఉంది. డిఎస్ కుమారుడు అరవింద్ నిజామాబాద్ లోకసభ స్థానంలో కెసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అమిత్ షాతో డిఎస్ భేటీపై కేసీఆర్ ఆరా: దొరికితే వేటు

అమిత్ షాతో డిఎస్ భేటీ: మతలబు ఏమిటి?

click me!