బాలకృష్ణ త్రీడీలా ఉన్నారు, మూడు రంగాల్లో సేవలు: కోడెల

Published : Jul 13, 2019, 02:23 PM IST
బాలకృష్ణ త్రీడీలా ఉన్నారు, మూడు రంగాల్లో సేవలు: కోడెల

సారాంశం

నటన, సేవ, రాజకీయాలు.. ఈ మూడు రంగాల్లో బాలయ్య ముందున్నారని కోడెల ప్రశంసించారు. క్యాన్సర్ వైద్యం కోసం డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని ఆయన అన్నారు. వైద్యం, పరికరాలకు ఖర్చు ఎంతైనా పేదలకు ఉచితంగా వైద్యం అందాలని ఆయన అన్నారు. 

హైదరాబాద్: హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ త్రిడీలా ఊన్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో త్రిడి మామ్మోగ్రఫీ యంత్రాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కోడెల మీడియాతో  మాట్లాడారు. 

నటన, సేవ, రాజకీయాలు.. ఈ మూడు రంగాల్లో బాలయ్య ముందున్నారని కోడెల ప్రశంసించారు. క్యాన్సర్ వైద్యం కోసం డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని ఆయన అన్నారు. వైద్యం, పరికరాలకు ఖర్చు ఎంతైనా పేదలకు ఉచితంగా వైద్యం అందాలని ఆయన అన్నారు. కోడెల శివప్రసాద రావు వృత్తిరీత్యా వైద్యుడనే విషయం తెలిసిందే.

నో ప్రాఫిట్, నో లాస్‌తో ఆసుపత్రిని నడిపిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు.  ఆధునిక పరికరాలను సమకూర్చుకుంటూ క్యాన్సర్ ఆసుపత్రిలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. క్యాన్సర్‌ను ముందే గుర్తించాలని ఆయన అన్నారు. 

ఎన్నో కారణాల వల్ల క్యాన్సర్ వస్తుందని బాలకృష్ణ తెలిపారు. దక్షణ భారత దేశంలో ఎక్కువ కాన్సర్ పరీక్షలు బసవ తారకంలోనే జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్