Hyderabad: డోర్ కూడా తీసుకోలేనంత ఫుల్లుగా మందు తాగి... కారులో చిక్కుకుని వ్యక్తి మృతి

By Arun Kumar PFirst Published Dec 30, 2021, 10:02 AM IST
Highlights

పీకలదాక మద్యం సేవించి ఆ మత్తులో కనీసం కారు డోర్ కూడా ఓపెన్ చేసుకోలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

హైదరాబాద్: ఫుల్లుగా మద్యం తాగి కనీసం కారు డోర్ కూడా తీసుకోలేనంత మత్తులోకి వెళ్లిపోయాడు ఓ మందుబాబు. ఇలా డోర్స్, విండోస్ అన్నీ పూర్తిగా మూసివుండటంతో ఊపిరాడక కారులోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిన మందుబాబు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ (hyderabad) లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ (secunderabad) సమీపంలోని బోయిగూడ ప్రాంతంలో ప్రశాంత్(38) భార్యా పిల్లలతో కలిసి నివాసముండేవాడు. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే కొంతకాలంగా మద్యానికి బానిసైన ప్రశాంత్ ప్రతిరోజూ తాగి ఇంటికివచ్చేవాడు. 

ఇలా గత మంగళవారం రాత్రి ఇంటికి సమీపంలోనే ప్రశాంత్ ఒక్కడే మద్యం సేవించాడు. తన కారులోనే డోర్స్, విండోస్ క్లోజ్ చేసుకుని ఫుల్లుగా తాగాడు. దీంతో ఆ మత్తులో కనీసం కారు డోర్లు కూడా ఓపెన్ చేసుకోలేకపోయాడు. ఇలా కారులోనే చాలాసేపు వుండటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 

read more  మందుబాబులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గం.ల వరకు మద్యం షాపులకు అనుమతి..

భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య వెళ్లిచూడగా అప్పటికే ప్రశాంత్ అపస్మారక స్థితిలో కారులో పడివున్నాడు. దీంతో ఆమె ప్రశాంత్ సోదరుడికి సమాచారమివ్వగా మరో తాళం తీసుకుని వచ్చి కారు డోర్స్ ఓపెన్ చేసారు. తీవ్ర అస్వస్థతతో కారులో పడివున్న ప్రశాంత్ ను వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.  

అయితే అతడి పరిస్థితి విషమంగా వుండటంతో దగ్గర్లోని గాంధీ హాస్పిటల్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు గాంధీకి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రశాంత్ మృతిచెందాడు. ఇలా తాగుడుకు బానిసై చివరకు ప్రాణాలు కోల్పోయాడు. 

ప్రశాంత్ మృతితో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ముఖ్యంగా భర్తను తలచుకుని అతడి భార్య ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

read more  హైద్రాబాద్‌ రాజేంద్రనగర్‌లో దారుణం: టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై యువకుడి అత్యాచారం

ఇదిలావుంటే ఓవైపు ఓమిక్రాన్ (omicron) విజృంభణ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం (telangana government) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆంక్షలను సడలిస్తూ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు కేసీఆర్ సర్కార్ అనుమతులు ఇచ్చింది. అంటే న్యూ ఇయర్ (new year celebrations) సందర్భంగా అర్ధరాత్రి వరకు వైన్ షాప్ లు తెరిచివుంచుకునేందుకు అనుమతిచ్చారు.  లైసెన్స్ హోల్డర్లు అర్ధరాత్రి వరకు తమ వ్యాపారాన్ని నిర్వహించవచ్చని తెలంగాణ ఎక్సైజ్ శాఖ (Excise Department) ఆదేశాలిచ్చింది. 

ఇక ఈ నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఈవెంట్‌లు ఉదయం 1 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.  ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా కేవలం ఆదాయం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని... వెంటనే ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

click me!