హైద్రాబాద్‌ ఎల్బీనగర్‌లో మందుబాబుల వీరంగం: కాలనీ వాసులపై దాడి, నర్సింహరెడ్డి అనే వ్యక్తి మృతి

By narsimha lodeFirst Published Jan 2, 2022, 11:41 AM IST
Highlights

హైద్రాబాద్ ఎల్బీనగర్ లో మందు బాబులు వీరంగం నిర్వహించారు.మందుబాబుల దాడిలో నర్సింహరెడ్డి అనే వ్యక్తి మరణించాడు.మద్యం సేవించివద్దని కాలనీ వాసులు అభ్యంతరం చెప్పడంతో మందు బాబులురెచ్చిపోయి కాలనీ వాసులపై దాడికి దిగారు. ఈ ఘటనలో నర్సింహరెడ్డి మరణించినట్టుగా పోలీసులు చెప్పారు.


హైదరాబాద్: Hyderabad ఎల్బీనగర్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. liquor తాగొద్దని చెప్పిన కాలనీ వాసులపై మందు బాబులు దాడికి దిగారు. ఈ ఘటనలో Narsimha Reddy అనే వ్యక్తి మరణించాడు.  ఈ దాడికి పాల్పడిన మందుబాబుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైద్రాబాద్ ఎల్బీనగర్‌లోని ఓ కాలనీకి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మందు బాబులు మద్యం సేవిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక కాలనీవాసులు ఇక్కడ మద్యం తాగొద్దని మందు బాబులకు చెప్పారు.  తమను మద్యం తాగొద్దని చెబుతారా అంటూ మందు బాబు కాలనీ వాసులపై దాడికి దిగారు.  ఈ దాడిలో కాలనీకి చెందిన నర్సింహరెడ్డి అనే వ్యక్తి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాలనీవాసులు ఆసుపత్రిక తరలించారు.ఈ దాడి తర్వాత మందుబాబులు పరారీలో ఉన్నారు.

also read:తాగడంలో తగ్గేదేలే.. తెలంగాణలో నిన్న ఒక్క రోజే ఎంత తాగారో తెలుసా .. ?

అయితే శనివారం నాడు రాత్రి  తమ కాలనీకి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో మద్యం తాగొద్దని నర్సింహరెడ్డి సహా కొందరు కాలనీ వాసులు మద్యంబాబులకు అభ్యంతరం తెలిపారు. అయితే ఈ ఖాళీ స్థలంలో మందు తాగుతున్న నలుగురు మందుబాబులు కర్రలు, రాళ్లతో కాలనీవాసులపై దాడికి దిగారు.   ఈ దాడిలో నర్సింహరెడ్డి సహ పలువురు గాయపడ్డారు. నర్సింహరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.

మద్యం తాగొద్దని వారించినందుకు గౌతమ్, మనోజ్, మానిక్, మిట్టులు  దాడికి దిగారు. వీరంతా మరికొంత మందిని పిలిపించుకొని  దాడికి దిగారు. రాళ్లు, హకీ స్టిక్స్  తో దాడికి దిగారని స్థానికులు చెప్పారు.  ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నిందితులు నివసిస్తున్నారని తెలిపారు.నర్సింహరెడ్డి మృతి చెందడంతో ఆయన బంధువులు నిందితుల ఇళ్లపై దాడికి దిగారు. ఈ నలుగురిపై గతంలో కూడా పలు కేసులున్నాయని కూడా స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

click me!