మొదటి భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో జంప్: చివరకు ఏం జరిగిందంటే?

By narsimha lode  |  First Published Jan 2, 2022, 10:10 AM IST


మొదటి భర్తతో పాటు పిల్లలను వదిలి ప్రియుడితో పారిపోయిన వివాహిత హైద్రాబాద్ లోని బల్కంపేటలో నివాసం ఉంటుంది. అయితే ఈ  విషయమై వివాహితతో పాటు ప్రియుడిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత మరోసారి వివాహిత అదృశ్యం కావడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.


హైదరాబాద్: మొదటి భర్తను పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన వివాహిత Hyderabad ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ కు చేరింది.  ఎస్సార్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఉమ్మడి Warangal జిల్లాలోని kazipet కు చెందిన మహిళకు హన్మకొండకు చెందిన  వ్యక్తితో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉంది. కొడుకుకు 16 ఏళ్లు, కూతురికి 13 ఏళ్లు.  కొంతకాలం క్రితం అమలాపురానికి చెందిన వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం  ప్రేమకు దారి తీసింది.  దీంతో 2021 ఆగష్టు 20న ఇంట్లో నుండి 10 తులాల బంగారం, 25 తులాల వెండి, లక్ష రూపాయాల నగదును తీసుకెళ్లింది. ప్రియుడితో కలిసి ఆమె హైద్రాబాద్ balkampet లో నివాసం ఉంటుంది. అయితే lover తో తన భార్య బంగారం, నగదుతో పారిపోయిందని పోలీసులకు వివాహిత మొదటి భర్త ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు  వివాహిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Latest Videos

also read:సవతి తండ్రితో ప్రేమాయణం.. 40 కోట్ల ఆస్తి దక్కదని.. తల్లిని కిరాతకంగా హత్య చేయించిన కూతురు..

హైద్రాబాద్ బల్కంపేటలో ప్రియుడితో కలిసి వివాహిత  ఉంటున్న విషయాన్ని గుర్తించిన Warangal  జిల్లా పోలీసులు  వివాహితతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత బల్కంపేటలోనే ఆమె ఉంటుంది. అయితే ఇటీవలనే ఆమె మరోసారి అదృశ్యమైంది. దీంతో ప్రియుడు ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె కోసంగ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన మొదటి భర్త, వివాహిత ప్రియుడు కూడా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం నాడు తన ప్రియుడితో కలిసి వివాహిత SR Nagar పోలీస్ స్టేషన్ కు చేరుకొంది. ఇంత కాలం ఎక్కడికి వెళ్లావని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. అయితే ఆ విషయం మాత్రం తనను అడగవద్దని కోరింది.

తెలుగు రాష్ట్రాల్లో భర్తలను వదిలి ప్రియుడితో వివాహేతర సంబంధాలు కొనసాగించిన కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ లోని స్వాతి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించింది. ప్రియుడి మోజులో భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి భర్త స్థానంలో ప్రియుడిని తీసుకొచ్చేందుకు స్వాతి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే.

ఈ ఘటన తర్వాత ఇదే తరహలో పలు ఘటనలు కూడా వెలుగు చూశాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివాహేతర సంబంధాల కోసం భర్తలను హత్య చేయించిన కేసులు కూడా నమోదయ్యాయి. వివాహేతర సంబంధాల కోసం భర్తలను హత్య చేయించడానికి కూడా భార్యలు వెనుకాడడం లేదు. అయితే గతంలో భర్తలు మరో మహిళ మోజులో పడి  భార్యలను హత్య చేయించిన ఘటనలు ఎక్కువగా ఉండేవి. అయితే   కొంతకాలంగా భార్యలు కూడా ప్రియుడి మోజులో భర్తలను హత్య చేయిస్తున్న  కేసులు నమోదౌతున్నాయి.

click me!