Hyderabad Accident: పల్టీలు కొడుతూ కారు బోల్తా... తాగుబోతులు ఎంత తాపీగా దిగుతున్నారో చూడండి...(సిసి వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jan 02, 2022, 11:23 AM ISTUpdated : Jan 02, 2022, 12:16 PM IST
Hyderabad Accident: పల్టీలు కొడుతూ కారు బోల్తా... తాగుబోతులు ఎంత తాపీగా దిగుతున్నారో చూడండి...(సిసి వీడియో)

సారాంశం

2021 చివరిరోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న యువకులు తాగిన మైకంలో కారును ర్యాష్ గా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల (new year celebrations) పేరిట తాగుబోతులు (drunken youth) చేస్తున్న వీరంగం అంతాఇంతా కాదు. పీకలదాకా తాగి రోడ్లపైకి వచ్చి పోలీసులకు చిక్కి నానా యాగీ చేసినవారు కొందరయితే... గల్లీల్లో తాగి హంగామా చేసిన వారు మరికొందరు. ఆనందంగా జరుపుకోవాల్సిన నూతన సంవత్సర వేడుకలు తాగుబోతుల చర్యలతో శృతిమించి ప్రమాదాలకు దారితీసాయి. ఇలా తాగిన మైకంలో కొందరు యువకులు కారును కాలనీలో వేగంగా పోనిచ్చి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ (hyderabad) శివారులోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది. 

గతేడాదికి వీడ్కోలు చెబుతూ డిసెంబర్ 31న కొందరు యువకులు పార్టీ చేసుకున్నారు. ఫుల్లుగా మద్యం సేవించిన యువకులు అదే మత్తులో కారులో వనస్థలిపురం (vanasthalipuram)లోని ఆంధ్ర కేసరి నగర్ లో మితిమీరిన వేగంతో చక్కర్లు కొట్టసాగారు. ఈ క్రమంలోనే ఓ అపార్ట్ మెంట్ వద్ద అదుపుతప్పిన కారు అతివేగంతో అపార్ట్ మెంట్ వైపు దూసుకెళ్లింది. అయితే అపార్ట్ మెంట్ గోడను ఢీకొట్టి పల్టీకొట్టి ఆగిపోయింది.  

Video

అయితే ప్రమాదానికి కొన్నిక్షణాల ముందువరకు చిన్నారులు, మహిళలు అపార్ట్ మెంట్ ముందే సంబరాలు జరుపుకున్నారు. వారంతా అలా లోపలికి వెళ్లారో లేదో కారు ప్రమాదం జరిగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని యువకులు కూడా ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. 

read more  Vikarabad SI : పెళ్లైన వారం రోజులకే వికారాబాద్‌ వన్‌టౌన్‌ ఎస్‌ఐ మృతి

ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ (drunk and drive accident) సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. కారు ప్రమాదానికి గురయి బోల్లా పడ్డాక అందులోంచి యువకులు తాపీగా బయటకు వస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో ఫుటేజి ఆదారంగా యువకులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు.

కాలనీలోని ఖాళీ స్థలంలో కొందరు యువకులు ప్రతిరోజూ మద్యం, గంజాయి తీసుకుంటున్నారని కాలనీవాసులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలనీవాసులు తెలిపారు. అప్పుడేచర్యలు తీసుకుని వుంటే ఈ ప్రమాదం జరిగివుండేది కాదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ