రోడ్డుపై మద్యం మత్తులో అర్థ‌న‌గ్నంగా బ్లేడ్‌తో మహిళ బీభత్సం..

By Mahesh Rajamoni  |  First Published Aug 28, 2023, 12:01 AM IST

Hyderabad: హైదరాబాద్ లో మద్యం మత్తులో ఒక‌ మహిళ అర్థ‌న‌గ్నంగా బ్లేడ్ ప‌ట్టుకుని బీభ‌త్సం సృష్టించింది. ఆమె బ్లేడు ప‌ట్టుకుని రోడ్డు వీధిలో నడుస్తూ అర‌వ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.
 


Drunk woman creates ruckus: హైదరాబాద్ లో మద్యం మత్తులో ఒక‌ మహిళ అర్థ‌న‌గ్నంగా బ్లేడ్ ప‌ట్టుకుని బీభ‌త్సం సృష్టించింది. ఆమె బ్లేడు ప‌ట్టుకుని రోడ్డు వీధిలో నడుస్తూ అర‌వ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

వివ‌రాల్లోకెళ్తే.. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ రోడ్డుపై బ్లేడుతో దాడి చేసిన ఘటన హైదరాబాద్ అశోక్ నగర్ లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఆమె బ్లేడుతో వీధిలో నడుచుకుంటూ వెళ్తోంది. శ‌బ్దాలు చేయ‌డం కూడా వినిపించింది. స‌ద‌రు మ‌హిళ అర్థ‌న‌గ్నంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. 

Latest Videos

అయితే, అటుగా ఇంటికి వెళ్తున్న ఒక‌ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ మహిళను పట్టుకుని స్థానికుల సహాయంతో బ్లేడ్ ను లాక్కుకున్నారు. మహిళ అర్ధనగ్నంగా ఉండటంతో కానిస్టేబుల్ ఆమెకు జాకెట్ కూడా ఇచ్చాడు. అనంతరం ఆ మ‌హిళ‌ను హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

హైదరాబాద్ లో మద్యం మత్తులో ఒక‌ మహిళ అర్థ‌న‌గ్నంగా బ్లేడ్ ప‌ట్టుకుని బీభ‌త్సం సృష్టించింది. ఆమె బ్లేడు ప‌ట్టుకుని రోడ్డు వీధిలో నడుస్తూ అర‌వ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. pic.twitter.com/TwAPU2CGXz

— Rajamoni Mahesh 🇮🇳 (@Rajamonimahesh)

కాగా, ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ హైదరాబాద్ లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. గ‌త ఏడాది హైదరాబాద్ శంషాబాద్ లో మద్యం మత్తులో ఓ మహిళ రోడ్డుపై కారును ఆపి వారితో గొడవకు దిగింది. ఈ ఘటనలో ఆమె ముగ్గురిని కొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.  

click me!