‘ఆమె నా భార్య.. ఊహూ నా భార్య...’ రచ్చకెక్కిన ఇద్దరు భర్తలు.. ఓ వివాహిత స్టోరీ.. ట్విస్ట్ ఏంటంటే...

Published : Jan 04, 2022, 09:22 AM IST
‘ఆమె నా భార్య.. ఊహూ నా భార్య...’ రచ్చకెక్కిన ఇద్దరు భర్తలు.. ఓ వివాహిత స్టోరీ.. ట్విస్ట్ ఏంటంటే...

సారాంశం

భర్తలుగా చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ వివాదం మరోసారి రచ్చకెక్కింది.  ఇద్దరు భర్తలు అంటూ సంజీవరెడ్డి నగర్ పోలీసులు  తనను కించపరిచేలా వ్యవహరించారని  ఆ వివాహిత ఆరోపించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎస్సార్ నగర్ కు చెందిన  దుర్గా సత్య దేవి, భర్త అని చెబుతున్న సత్య వరప్రసాద్ తో కలిసి మాట్లాడుతుండగా ‘అమ్మా..రా అమ్మా..’ అంటూ ఓ బాలిక ఏడుస్తూ ఆమె కాళ్ళకు చుట్టుకుంది.

హైదరాబాద్ :  ఇదో విచిత్రమైన కేసు.. ఎంతటి Suspense Thriller Story అయినా.. ఎన్ని Twistలతో ఉన్న సినిమా అయినా జీవితంలో జరిగే Melo Drama ముందు ఎందుకూ పనికిరావు. అలాంటి ట్విస్టెడ్ స్టోరీ ఇదీ. Two husbands .. One wife  కథ.. ఆమె నా భార్య అంటూ మొదటి భర్త వాదిస్తుంటే.. అతను నా భర్త కాదు, వాళ్లు నా పిల్లలు కాదు.. ఇతనే నా అసలైన భర్త అంటూ రెండో భర్తను చూపిస్తుంది ఆ మహిళ. 

ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. అతను అక్క భర్త అని సదరు మహిళ చెబుతుంటే.. ఆమె తల్లిదండ్రులు మాత్రం.. తన కూతుర్ని మొదటి భర్తకు ఇచ్చే వివాహం చేశామని.. వారికి ఇద్దరు పిల్లలని చెబుతున్నారు... కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉంది కదా.. రియల్ లైఫ్ కదా మరి.. ట్విస్టులు ఎక్కువ.. ఈ స్టోరీ చదివితే అసలు మ్యాటర్ మీకే అర్థమవుతుంది. 

భర్తలుగా చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ వివాదం మరోసారి రచ్చకెక్కింది.  ఇద్దరు భర్తలు అంటూ సంజీవరెడ్డి నగర్ పోలీసులు  తనను కించపరిచేలా వ్యవహరించారని  ఆ వివాహిత ఆరోపించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎస్సార్ నగర్ కు చెందిన  దుర్గా సత్య దేవి, భర్త అని చెబుతున్న సత్య వరప్రసాద్ తో కలిసి మాట్లాడుతుండగా ‘అమ్మా..రా అమ్మా..’ అంటూ ఓ బాలిక ఏడుస్తూ ఆమె కాళ్ళకు చుట్టుకుంది.

నాకు సంబంధం లేదు: రామకృష్ణ కుటుంబం సూసైడ్‌పై ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవేంద్ర

ఆమె కొడుకుని అంటూ 17 సంవత్సరాల బాలుడు వచ్చాడు. అతను తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను ప్రదర్శించాడు. ఇంత జరుగుతున్నా కానీ ఆమె కనికరం చూపలేదు. ఈ సందర్భంగా దుర్గాసత్యాదేవి మాట్లాడుతూ.. మొదటి భర్తను అంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి తన భర్త కాదని, తన సోదరి భర్త అని.. ఆమె చనిపోవడంతో పిల్లలను చేరదీసి పెంచానని చెప్పుకొచ్చింది. దీంతో వారు తనని తల్లిగా భావిస్తున్నారని పేర్కొంది. 

అంతేకాదు తనను తన భార్య అని చెప్పుకుంటున్న శశికాంత్ శర్మ తాను తప్పుడు కేసులో జైలుకు వెళ్లినప్పుడు ఎక్కడికి వెళ్ళాడని, తాను వివాహం చేసుకుంటున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించింది. సత్య ప్రసాద్ మాట్లాడుతూ… దుర్గా సత్యదేవి పేరున 15 ఎకరాల భూమి ఉండడంతో దానిని తీసుకోవడానికే.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

హన్మకొండకు చెందిన శశికాంత్ శర్మ మాట్లాడుతూ…  1999లో తనకు వివాహం అయిందని, కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు. తనతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి.. ఇప్పుడు పిల్లలను వదిలి ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తితో వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.  

సత్య దేవి తల్లిదండ్రులు వచ్చి దుర్గా సత్య దేవి తన రెండో కుమార్తె అని, శశికాంత్ శర్మ తోనే వివాహం జరిపించామని, వారికి కుమార్తె, కొడుకు ఉన్నారని తెలిపారు.  తమకు ఎలాంటి భూములు లేవని కూడా చెప్పుకొచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా