హైద్రాబాద్ పాతబస్తీలో మెట్రో పనులు: డ్రోన్ సర్వే చేసిన అధికారులు

By narsimha lode  |  First Published Aug 27, 2023, 10:27 PM IST


పాతబస్తీలో  మెట్రో పనుల కోసం  డ్రోన్ సర్వే చేపట్టారు అధికారులు. పాతబస్తీలో  మెట్రో పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 


హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో పనుల కోసం ఆదివారంనాడు హైద్రాబాద్ మెట్రో అధికారులు  డ్రోన్ ద్వారా సర్వే పనులు నిర్వహించారు.పాతబస్తీలో మెట్రో అలైన్ మెంట్  , ప్రభావిత ఆస్తులపై  డ్రోన్ సర్వే నిర్వహించారు. 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు అడ్డంకిగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. 103 స్థలాలపై  ప్రతికూల ప్రభావం లేకుండా ప్రణాళిక వేస్తున్నట్టుగా హైద్రాబాద్ మెట్రో రైలు  ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మరికొన్ని  రోజుల్లో భూ పరిశోధనకు టెండర్లు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు.

ఫలక్ నుమా రైల్వే స్టేషన్ లో భూసామర్థ్య పరీక్షలు ప్రారంభించనున్నట్టుగా మెట్రో రైలు ఎండీ చెప్పారు.  పాతబస్తీలో  సాలార్ జంగ్ మ్యూజియం, ఫలక్ నుమా,శాలిబండ, చార్మినార్ ల వద్ద  రైల్వే స్టేషన్లను నిర్మించాలని  అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Latest Videos

పాతబస్తీలో  మెట్రో రైలు పనులను  పూర్తి చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే మెట్రో రైలు నిర్మాణ పనులనకు హైద్రాబాద్ మెట్రో రైలు అధికారులు  సర్వేను చేపట్టారు. ఇప్పటికే  ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు పనులు  జరిగాయి. ఎంజీబీఎస్ నుండి  మెట్రో రైలు పనులను విస్తరించనున్నారు.

ఇదిలా ఉంటే  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కూడ  రాష్ట్ర ప్రభుత్వం  మెట్రో రైలు పనులకు  శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మరో వైపు నగర శివార్లకు కూడ హైద్రాబాద్ మెట్రోను విస్తరించాలని  కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు ఈ ఏడాది జూలై  31న కేబినెట్ సమావేశం తీర్మానం చేసింది. ఈ దిశగా అధికారులు కార్యాచరణను ప్రారంభించనున్నారు. నగర శివార్లలో మెట్రో విస్తరణ పనుల కోసం  సర్వే పనులను చేపట్టనున్నారు.

click me!