మందు బాబులకు ఏ శిక్షలు పడ్డాయో తెలుసా?

First Published Jul 1, 2017, 10:28 AM IST
Highlights

మందు ప్రియులకు, మందు బాబులకు ఇది రుచించని చేదువార్త. ఎందుకంటే ఫూటుగా మందు కొట్టాలనుకునే వారు ఈ వార్త చదవగానే సగం మందుతోనో, కొద్దిగ తాగి సరిపుచ్చుకుంటారు. ఇంతకూ మందుబాబులకు చేదు వార్త ఏందంటారా?

మోతాదుకు మించి మందు తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మందుబాబులకు ఏడు రోజుల పాటు జైలు శిక్ష విధించింది ఎర్రమంజిల్‌ ప్రత్యేక కోర్టు. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం.

 

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ 228 మంది మందు బాబులను హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. కోర్టులో వారిని విచారించిన న్యాయమూర్తి వారు తాగిన మోతాదు ఆధారంగా శిక్షలను విధిస్తూ తీర్పులు వెలువరించారు. వారి తాగుడు మోతాదు, వారికి పడిన శిక్షల వివరాలు ఈ కింద చదవండి.

 

ఫూటుగా మందు కొట్టిన ఇద్దరికి ఏడు రోజులు జైలు శిక్ష విధించారు.

 

మరో ముగ్గురికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది.

 

ఇంకో ఇద్దరికి మూడు రోజులు జైలు జీవితం.

 

ఇంకో ఆరుగురికి రెండు రోజులపాటు జైలు శిక్ష విధించారు.

 

మరో ఆరుగురికి ఒకరోజు జైలుశిక్ష విధించారు.

 

ఇక మిగిలిన 209 మందికి ఒకరోజు సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

మొత్తానికి పీకల  దాకా తాగి తందనాలాడాలనుకునే మందుబాబులారా జర ఆలోచించండి. అంతగనం తాగకండి. ఒకవేళ తాగినా రోడ్ల మీద తిరగకండి. తస్మాత్ జాగ్రత్త. పోలీసులు తోలు వలుస్తారు.

click me!