సినిమా టికెట్ ధరల పెంపు నిలిపివేత

First Published Jun 30, 2017, 6:23 PM IST
Highlights

తెలంగాణ సర్కారు నాలుక కరుచుకుంది. జులై నుంచి సినిమా టికెట్ల ధరలు పెంచాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది సర్కారు. జిఎస్టి అమలు నేపథ్యంలో సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచేందుకు సర్కారు అనుమతించింది. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా నిలుపుదల చేసింది.

ఇటీవల జారీ చేసిన సినిమా టికెట్ల ధర పెంపు ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంపునకు సంబంధించిన దస్త్రాన్ని సీఎం వద్దకు పంపాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచుతూ హోంశాఖ ఇటీవల ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఏసీ థియేటర్లో గరిష్ఠంగా రూ.70 ఉన్న టికెట్ ధర ఒక్కసారిగా రూ.120కి చేరింది.

ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన సిఫార్సులు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇవాళ ధరల అమలు ఉత్తర్వులను నిలిపివేసింది.

click me!