మూడు ముఖ్యమయిన హైదరాబాద్ కబుర్లు

First Published Sep 13, 2017, 8:36 AM IST
Highlights
  • తెలంగాణలో తెలుగు తప్పనిసరి
  • ఇక తెలంగాణలో  ఐదో ఆట
  • లేట్ నైట్ మజా... హైదరాబాద్ లో రాత్రి 11 దాకా వైన్ షాపులు

తెలంగాణలో తెలుగు తప్పనిసరి

 

తెలుంగాణాలో ఇతర దక్షిణాది రాష్ట్రాలలో లాగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు కచ్చితం చేశారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధిస్తారు.  అదేవిధంగా తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులు ఇక ముందు కచ్చితంగా తెలుగులోనే రాయాలి. ఇవి ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న కొన్నిముఖ్యమయిన తెలుగు నిర్ణయాలు. ప్రగతిభవన్‌లో ప్రపంచ తెలుగు మహసభల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తూ తెలుగు భాషాభివృద్ధికి పటిష్టమయిన చర్యలు అవసరమన ఈ నిర్ణయాలు ప్రకటించారు.తెలుగు అకాడమీ సిలబస్ నే విద్యాసంస్థలలొ బోధించాల్సి ఉంటుంది.

ఇక ప్రపంచ తెలుగు మహాసభల విషయంలో రాష్ట్ర అకాడమీద సభ నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో ఇకపై అనుమతినీయాలని కూడా నిర్ణయించారు. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్దూ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండొచ్చు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ సిలబస్ రూపొందించి వెంటనే పుస్తకాలు ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించడం అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

ఇక తెలంగాణలో  ఐదో ఆట

 

దసరా నుంచి థియేటర్లలో ఐదో ఆట వేస్తారు. అయితే కేవలం చిన్న సినిమాలు వేసేందుకు అనుమతి  ప్రభుత్వం అనుమతిస్తుంది. ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నవంబర్ లో హైదరాబాద్ లో జరగనున్న బాలల చలనచిత్ర ఉత్సవాలకు 8 కోట్ల రూపాయలు ఖర్చే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది.

 

లేట్ నైట్ మజా... హైదరాబాద్ లో రాత్రి 11 దాకా వైన్ షాపులు

 

లేట్ నైట్ మందు దొరకక  మందుబాబులో ఎక్కడ అక్రమంగా దొరికే ఏదో  ఒక సరుకు కొని సర్దుకుపోవాల్సిన పనిలేదు.  వీళ్లకష్టాలు ప్రభుత్వం గమనిచింది. లేట్ మజా అంతరాయంలేకుండా హైదరాబాద్‌ లో మద్యం దుకాణాలను రాత్రి 11 గంటల వరకు తెరిచిఉంచాలని నిర్ణయించారు.తెరిచి చారో లేదో ... చూసేందుకు  మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని అబ్కారీ శాఖ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించి పర్యవేక్షిస్తారు.

 

click me!