హైదరాబాద్ సిటీ వదిలి వెళ్లొద్దు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు..

By team teluguFirst Published Oct 29, 2022, 10:01 AM IST
Highlights

24 గంటల పాటు హైదరాబాద్ సిటీ వదలి ఎక్కడికీ వెళ్లకూడదని ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై నేడు విచారణ జరగనుంది. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల దాకా హైదరాబాద్ సిటీని దాటి వెళ్లొద్దని చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, కోరె నందు కుమార్, డీపీఎస్ కేవీఎన్ సింహాయాజిలు అడ్రస్ లను పోలీసులకు అందించాలని పేర్కొంది.

మునుగోడు బై‌ పోల్‌: ఈ నెల 31 నిర్వహించ తలపెట్టిన సభను రద్దు చేసుకున్న బీజేపీ.. కారణం ఇదేనా..?

ఈ కేసులో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంప్రదించకూడదని తెలిపింది. అలాగే ఇందులో సాక్షులెవరినీ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదని తెలిపింది. ఈ కేసులో నిందితులకు హైకోర్టు రిమాండ్ ను తిరస్కరించడంతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో నిందితులకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నేడు విచారణ జరగనుంది.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రత పెంపు.. రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు..

వాస్తవానికి శుక్రవారం కోర్టు లంచ్ టైంలో పోలీసులు అత్యవసర విచారణ కోరారు. దీంతో ధర్మాసనం సాయంత్రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు శాసన సభ్యులను ప్రలోభ పెట్టారని పేర్కొంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ నిందితులను కోర్టు రిమాండ్ కు ఇవ్వకపోవడం సరైంది కాదని పేర్కొంది.

రాజస్థాన్‌ : అజ్మీర్ దర్గాలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు (వీడియో)

ఈ ఘటన తెలంగాణ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా జరిగిందని తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇతర దేశానికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెప్పింది. సెక్షన్ 41ఎ కింద నోటీసు ఇవ్వలేదనే రీజన్ తో నిందితులకు రిమాండ్ ఇవ్వకపోవడం సరైంది కాదని తెలిపింది. సెక్షన్ 41 బి కింద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంతృప్తి చెందితే నిందితులను అదుపులోకి తీసుకునే అధికారం ఉంటుందని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను వెంటనే లొంగిపోయేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కాగా.. నిందితులు తరుఫున వాదనలు వినిపించిన లాయర్ కొంత సమయం కావాలని కోరారు. దీంతో ఈ కేసుపై నేడు విచారణ జరగనుంది. 

click me!