
డ్రగ్స్ దందా తెలంగాణ లో బాగా ప్రచారం పొందుతున్నది. అందులో చాలా మందిని సిట్ టీం విచారిస్తుంది. ఇప్పటి వరకూ సిట్ విచారించిన వారిలో ఎవరికీ శిక్షలు పడే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు చెపుతున్నారు. అందుకు ప్రధాన కారణం సిట్ ఈ కేసులో నిరూపించదగ్గ సాక్ష్యాలను సేకరించలేదని పేరొందిన న్యాయవాదుల వాదన. గత నెల రోజులుగా సిట్ నుండి నగరంలో చాలా మందికి నోటీసులు అందాయి. అందులో సినిమా వాళ్లు అధికంగా ఉన్నారు. వాళ్లంత న్యాయవాదులను ఆశ్రయించారు.
న్యాయవాదులు ఇచ్చిన వివరాల ప్రకారం ఇలా ఉంది. ఇప్పుడున్న చట్టాల ప్రకారం, ఎవరికి శిక్షలు పడవని అన్నారు, కారణం ఇంతవరకూ నోటీసులు అందుకున్న ఏ సినీ ప్రముఖుడి వద్దా ప్రత్యక్షంగా డ్రగ్స్ పట్టుబడలేదన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ దొరక్కుండా, కేవలం వాడారని నిరూపించినంత మాత్రాన వారిని జైలుకు పంపే అవకాశాలు లేవన్నది న్యాయవాదుల వాదన. సిని పరిశ్రమ నుండి ఎవరైతే సిట్ టీం పిలిచిందో వారిని ధైర్యంగా విచారణకు వెళ్లాలని చెబుతున్నారు. సిట్ టీం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని వారు సూచించారు.
ఇక జుట్టు వెంట్రుకలు లేదా గోళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లను నిరూపించినా, అది జైలు శిక్షల వరకూ వెళ్లదని, ఇక గత మూడు నెలల కాలంలో డ్రగ్స్ తీసుకోని వాళ్ల నుంచి డ్రగ్స్ ఆనవాళ్లు నిరూపించడం అసాధ్యమని చెబుతున్నారు. డ్రగ్స్ వాడిన వాళ్లను కేవలం బాధితులుగా మాత్రమే పరిగణించాలని మన చట్టాలు చెబుతుండటంతో, న్యాయవాదు కూడా మరేమీ జరగదని అంటున్నారు. డ్రగ్స్ వాడినట్లు నిరూపితం అయితే వారిని తక్షణమే రిహబ్లిటేషన్ సెంటర్‌కి చేర్చాలని కోర్టు సూచిస్తుందని న్యాయవాదులు తెలిపారు.
సిట్ నుండి నోటీసులలు అందిన చార్మీ కోర్టుకెక్కింది. తన నుండి వెంట్రుకలు, గోళ్లు తీసుకోవద్దని కోర్టును ఆశ్రయించింది.