తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

By pratap reddyFirst Published Sep 19, 2018, 7:34 PM IST
Highlights

మనోహరాచారి తన అల్లుడు సందీప్, కూతురు మాధవిలపై బుధవారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మాధవి తీవ్రంగా గాయపడింది. మాధవి మెడ నరాలు తెగిపోయాయని, రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగిందని వైద్యులు అంటున్నారు.

హైదరాబాద్: తండ్రి మనోహరాచారి దాడిలో గాయపడిన మాధవి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. రెండు, మూడు రోజులైతే గానీ ఆమె పరిస్థితి ఏమిటనేది చెప్పలేమని వైద్యులు అంటున్నారు. మనోహరాచారి తన అల్లుడు సందీప్, కూతురు మాధవిలపై బుధవారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మాధవి తీవ్రంగా గాయపడింది.

మాధవి మెడ నరాలు తెగిపోయాయని, రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగిందని వైద్యులు అంటున్నారు. ఎడమ చేయి సగం వరకు తెగిందని చెప్పారు. రోడ్డుపై ఘటన జరగడంతో ఇన్ ఫెక్షన్ కూడా ఎక్కువగా ఉందని చెప్పారు. కాస్మోటిక్ సర్జన్, న్యూరో సర్జన్, వాస్కులక్ సర్జన్ ద్వారా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. 

మాధవి హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త సందీప్ నీలిమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన మనోహరాచారి పోలీసులకు లొంగిపోయాడు.

బట్టలు ఇప్పిస్తాను, రావాలని చెప్పి వారు వచ్చిన తర్వాత మనోహరాచారి నడి రోడ్డుపై అల్లుడిపై, కూతురిపై కత్తితో దాడి చేశాడు. రోడ్డు మీద పోతున్న వారు అతన్ని ఆపడానికి ఏ విధమైన ప్రయత్నం కూడా చేయలేదు.  

సంబంధిత వార్తలు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

click me!