కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

By narsimha lodeFirst Published Sep 19, 2018, 7:18 PM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి పీసీసీ అనుబంధంగా ఏర్పాటు చేసిన మూడు కమిటీల్లో చోటు కల్పించారు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి పీసీసీ అనుబంధంగా ఏర్పాటు చేసిన మూడు కమిటీల్లో చోటు కల్పించారు. అన్ని కమిటీల్లో అందరికి  స్థానం కల్పించే ప్రయత్నం చేశారు. అయితే  తాము కోరుకొన్న పదవులను నాయకులకు మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వడంపై ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధ కమిటీలను ఎఐసీసీ బుధవారం నాడు ప్రకటించింది.అయితే  కాంగ్రెస్ పార్టీని వీడి ఈ నెల 12వ,తేదీనే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించిన  జాబితాలోని మూడు కమిటీల్లో సురేష్‌రెడ్డి పేరు ఉంది. అయితే సురేష్ రెడ్డి పార్టీ మారిన విషయాన్ని ఎఐసీసీ అధిష్టానానికి సమాచారం ఇవ్వలేదా... సురేష్ రెడ్డి పేరు జాబితాలో ఎలా ఉండనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.అయితే ఈ జాబితాలోని మూడు కమిటీల్లో సురేష్ రెడ్డి పేరు ఉండడంపై కాంగ్రెస్ పార్టీ జాబితా కూర్పు చేసిన కసరత్తు ఏ రకంగా జరిగిందో తేటతెల్లం చేస్తోంది.ఎన్నికల కమిటీ, కోఆర్డినేషన్, మేనిఫెస్టో కమిటీలో కూడ స్థానం కల్పించారు.

ఈ కమిటీలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ  నేతలు వి. హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.  పీసీసీ చీప్ పదవిని ఆశించిన  మాజీ మంత్రి డీకే అరుణకు క్యాంపెయిన్ కమిటీలో చోటు కల్పించారు. హనుమంతరావు స్ట్రాటజీ కమిటీలో పదవి కల్పించడంపై  హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు.తనకు క్యాంపెయిన్  పదవి కావాలని హనుమంతరావు కోరుకొన్నారు. కానీ, స్ట్రాటజీ కమిటీ ఛైర్మెన్ పదవిని కల్పించడంపై అసంతృప్తితో ఉన్నారు.

అయితే సీనియర్లకు పార్టీ పదవులను  కల్పించేందుకు ప్రయత్నాలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు నేతలకు పదవులు కట్టబెట్టారు.  దక్షిణ తెలంగాణకు చెందిన  రేవంత్ రెడ్డికి , ఉత్తర తెలంగాణ నుండి బీసీకి చెందిన పొన్నం ప్రభాకర్ కు పదవి దక్కింది.

మరోవైపు  డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు కూడ ఆయా కమిటీల్లో పదవులు దక్కాయి. అయితే  పార్టీలో చేరిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి దక్కడంతో  ఇప్పటివరకు పార్టీలోనే కొనసాగుతున్న నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.


సంబధింత వార్తలు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

click me!