కరోనా ఎఫెక్ట్: గాంధీ ఆసుపత్రి ఎదుట డాక్టర్ వసంత్ హైడ్రామా, అరెస్ట్

By narsimha lodeFirst Published Feb 11, 2020, 1:14 PM IST
Highlights

కరోనా వైరస్ విషయమై మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారనే నెపంతో డాక్టర్ వసంత్ పై అధికారులు చర్యలు తీసుకొన్నారు. దీంతో డాక్టర్ వసంత్ మంగళవారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు ఆయనను చాకచక్యంగా పట్టుకొన్నారు. 


హైదరాబాద్: కరోనా వైరస్ పాజిటివ్  కేసు నమోదైందని తప్పుడు సమాచారం ఇచ్చారని పనిష్మెంట్‌కు గురైన వసంత్ గాంధీ ఆసుపత్రి ఎదుట మంగళవారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గంట తర్వాత పోలీసులు అతడిని సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.

గాంధీ ఆసుపత్రిలో  రెండు కరోనా వైరస్ పాజిటిల్ కేసులు నమోదైనట్టుగా  తప్పుడు సమాచారాన్ని మీడియాకు ఇచ్చారనే ఆరోపణలతో  డాక్టర్ వసంత్‌పై సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకొంది. డాక్టర్ వసంత్‌ను డైరెక్టర్ ఆప్ హెల్త్‌కు సరెండర్ చేసింది.

Also read:కరోనా ఎఫెక్ట్: తప్పుడు ప్రచారం, గాంధీ‌ ఆసుపత్రిలో డాక్టర్‌పై వేటు

 మరో ముగ్గురు డాక్టర్లపై కూడ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ఉద్దేశ్యపూర్వకంగానే గాంధీ ఆసుపత్రిలో వైద్యులు తనను ఇరికించారని డాక్టర్ వసంత్  ఆరోపిస్తున్నారు.

డాక్టర్ వసంత్  మంగళవారం నాడు  తన షర్టు లోపల  పెట్రోల్   బాటిల్  పెట్టుకొని వచ్చాడు. తన షర్ట్ ను అప్పటికే కొంత పెట్రోల్ పోసుకొన్నాడు. తన దగ్గరకు వస్తే నిప్పు అంటించుకొంటానని  డాక్టర్ వసంత్ గాంధీ ఆసుపత్రి వద్ద దాదాపుగా గంట పాటు అక్కడే హంగామా చేశారు. 

 గాంధీ ఆసుపత్రిలో  గంటపాటు డాక్టర్ వసంత్ హంగామా సృష్టించారు. మీడియాతో డాక్టర్ వసంత్ మాట్లాడుతున్న సమయంలో  చాకచక్యంగా పోలీసులు డాక్టర్ వసంత్ ను తమ అదుపులోకి తీసుకొన్నారు.

ఓ పోలీసు అధికారి డాక్టర్ వసంత్ చేతిలోని లైటర్‌ను గట్టిగా పట్టుకొన్నాడు. మరికొందరు పోలీసులు వచ్చి వసంత్ షర్టులో ఉన్న పెట్రోల్ బాటిల్ ను తీసుకొన్నాడు.మరో వైపు డాక్టర్ వసంత్ పై నీళ్లు చల్లారు. 

ఈ సమయంలో  డాక్టర్ వసంత్   భార్య అక్కడే ఉన్నారు. ఆయనను వారించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం వినలేదు.   మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు అయనను తమ అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తీసుకెళ్లారు.
 

click me!