ఏకే 47 కలకలం... సినిమాల్లో చూసి, తుపాకీ దొంగతనం చేసి..

By telugu teamFirst Published Feb 11, 2020, 9:38 AM IST
Highlights

సినిమాలు, యూట్యూబ్‌లు చూసి ఏకే–47 ఎలా ఫైర్‌ చేయాలో తెలుసుకున్నాడు. బుల్లెట్లు, ట్రిగ్గర్‌ పాడవకుండా కొబ్బరినూనెతో తుడిచేవాడు. బుల్లెట్లు లేకుండా ఏకే–47 ట్రిగ్గర్‌ నొక్కుతూ మురిసిపోయేవాడు. ఇలా ఏకే–47 ఫైర్‌ చేయడం నేర్చుకున్నాడు.

ఇటీవల సిద్ధిపేటలో ఓ వ్యక్తి ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆయన జరిపిన కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు కానీ... అసలు నిందితుడి వద్దకు ఏకే 47 ఎలా వచ్చిందనే అనుమానం పోలీసులకు కలిగింది. కాగా... వారి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితుడతు  సదానందంకి ఆయుధాలన్నా, తుపాకులన్నా పిచ్చి. ఈ పిచ్చే ఠాణాలో తుపాకులు చోరీచేసే వరకూ తీసుకెళ్లింది. వీటిని దొంగిలించాక ఇంట్లోనే దాచి, ఎవరూలేని సమయంలో చూసుకుని మురిసిపోయేవాడు. సినిమాలు, యూట్యూబ్‌లు చూసి ఏకే–47 ఎలా ఫైర్‌ చేయాలో తెలుసుకున్నాడు. బుల్లెట్లు, ట్రిగ్గర్‌ పాడవకుండా కొబ్బరినూనెతో తుడిచేవాడు. బుల్లెట్లు లేకుండా ఏకే–47 ట్రిగ్గర్‌ నొక్కుతూ మురిసిపోయేవాడు. ఇలా ఏకే–47 ఫైర్‌ చేయడం నేర్చుకున్నాడు.

Also Read సిద్ధిపేటలో కాల్పుల కలకలం.. ఏకే47 తుపాకీతో కాల్చి....

కాగా.. తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు ముందే ఈ తుపాకీని పోలీస్ స్టేషన్ నుంచి దొంగలించడం గమనార్హం. పాత కేసుల క్రమంలో తరచూ హుస్నాబాద్ స్టేషన్ కి వెళ్లి వచ్చే సదానందం... ఎవరూ చూడకుండా తుపాకీ, కార్బైడ్ లను చోరీ చేశాడు. అయితే... పోలీసులు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు.

గతంలో హుస్నాబాద్‌ జిల్లా ఉమ్మడి కరీంనగర్‌ పరిధిలో ఉండేది. 2016, అక్టోబర్‌లో జిల్లాల పునర్విభజన అనంతరం డిసెంబర్‌లో సిద్ధిపేట జిల్లాలోని పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వెళ్లిపోయింది. అదే ఏడాది డిసెంబర్‌లో ఆయుధాలను కమిషనరేట్‌కి లెక్కచూపే క్రమంలో ఏకే–47 మిస్సింగ్‌ విషయం వెలుగుచూసింది. దీంతో అప్పటి సీఐ గన్‌మెన్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా సదానందం ఆ తుపాకీని వాడి కాల్పులు  జరగడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

click me!