అక్బరుద్ధీన్ పై దాడి కేసు.. ప్రధాన నిందితుడు పహిల్వాన్ మృతి

By telugu team  |  First Published Feb 11, 2020, 10:32 AM IST

2011 ఏప్రిల్ 30వ తేదీన అక్బరుద్దీన్ పై హత్యాయత్నం జరిగింది. అక్బరుద్దీన్  శరీరంలోకి 3 బులెట్లు, ఐదు కత్తిపోట్లు దిగాయి.  ఈ కేసులో మహమ్మద్ పహిల్వాన్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.


ఎంఐఎం నేత అక్బుర్దీన్ పై దాదాపు 12 సంవత్సరాల క్రితం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి.. నిర్దోషిగా విడుదలై బయటకు వచ్చిన మహమ్మద్ పహిల్వాన్ మృతి చెందాడు.

Also Read ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు...

Latest Videos

సోమవారం ఆయన గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం యశోధ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా.. 2011 ఏప్రిల్ 30వ తేదీన అక్బరుద్దీన్ పై హత్యాయత్నం జరిగింది. అక్బరుద్దీన్  శరీరంలోకి 3 బులెట్లు, ఐదు కత్తిపోట్లు దిగాయి.  ఈ కేసులో మహమ్మద్ పహిల్వాన్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. పహిల్వాన్ సహా తొలుత 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే... మహమ్మద్ పహిల్వాన్ నిర్దోషి అంటూ కోర్టు తేల్చి చెప్పింది. గతేడాది ఈ కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. 

click me!