వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం.. నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్

Siva Kodati |  
Published : Feb 10, 2023, 06:08 PM IST
వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం.. నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్

సారాంశం

ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. గతేడాది వైశాలి కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. డిసెంబర్‌లో డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేశాడు నవీన్ రెడ్డి. తనను పెళ్లి చేసుకోవాలని వైశాలిని ఇబ్బందులు పెట్టాడు. 

ఇక, వైశాలి కిడ్నాప్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి  తెలిసిందే. వైశాలి నిశ్చితార్థం రోజే దాదాపు 40 మందితో ఆమె ఇంటికి వచ్చిన నవీన్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. నవీన్ రెడ్డితో వచ్చినవారు వైశాలి కుటుంబ సభ్యులపై దాడి చేయగా.. నవీన్ రెడ్డి ఆమెను తీసుకుని కారులో వెళ్లిపోయాడు. అయితే కొన్ని గంటల్లోనే పోలీసులు వైశాలిని క్షేమంగా రక్షించారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నవీన్ రెడ్డిని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు.. తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. నవీన్ రెడ్డికి ఇబ్రహీంపట్నం కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అలాగే గత నెలలో ఆయనకు న్యాయస్థానం బెయిల్ సైతం నిరాకరించింది.

ALso REad: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన రంగారెడ్డి కోర్టు

ఇకపోతే.. నవీన్ రెడ్డి కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్‌‌లో కీలక అంశాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ‘‘బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు వైశాలి నాకు పరిచయమైంది. నేను  ప్రేమిస్తున్నట్టుగా వైశాలికి చెప్పాను. వైశాలి నా ప్రేమను నిరాకరించింది. వైశాలి తండ్రి దగ్గరికి ప్రేమ పెళ్లి ప్రపోజల్ తీసుకెళ్లాను. అయితే ఆమె కుటుంబ సభ్యులు నా ప్రపోజల్‌ను ఒప్పుకోలేదు. వైశాలిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అందుకే వైశాలిని వేధించడం మొదలుపెట్టాను. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో ఫొటోలు, వీడియోలు పెట్టానని అతను చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్