
తెలంగాణ ప్రభుత్వం మరో రెండు పథకాలను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో మహాలక్ష్మీ పథకం (Mahalaxmi scheme)లో భాగంగా ఉన్న రూ.500లకే సిలిండర్ ఒకటి కాగా.. గృహజ్యోతి (Gruha jyoti scheme) పథకంలో భాగమైన 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ మరొకటి. ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పథకాలకు విధి విధాలను రూపొందించే ప్రక్రియకు ఆమోదం లభించింది. దీంతో అధికారులు దీని కోసం కసరత్తు ప్రారంభించి, ఈ పథకాల కోసం మార్గదర్శకాలను విడుదల చేశారు. దీంతో కింది స్థాయి అధికారులు వాటిని సేకరించే పనిలో పడ్డారు.
అంగన్ వాడీ జాబ్స్ ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి పదే పదే..
గృహజ్యోతి పథకానికి అర్హులు వీరే..
నెలకు 200 యూనిట్ల వరకు కరెంట్ వాడే కుటుంబాలు గృహజ్యోతి పథకానికి అర్హులు. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉంటే ఈ పథకం వర్తించింది. అయితే అద్దె ఇళ్లలో ఆయా పోర్షన్ లకు విడివిడిగా మీటర్లు ఉంటే పరవాలేదు. ఒకే ఇంట్లో పలు పోర్షన్ లలో అద్దెకు ఉంటున్న వారు తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, రేషన్ కార్డు జత చేయాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని మరే ఇతర ప్రాంతంలోనూ దీనికి దరఖాస్తు చేయకూడదు.
పసికందును ఊయలకు బదులు ఓవెన్ లో పడుకోబెట్టిన తల్లి.. తరువాత ఏమైందంటే ?
ఒక వేళ ఊర్లో సొంత ఇళ్ల ఉండి, జీవనోపాధి కోసం హైదరాబాద్ లేదా తెలంగాణలోని మరే ప్రాంతంలోనైనా అద్దెకు ఉంటుంటే.. ఎక్కడైనా ఒక చోట మాత్రమే గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే దీని కోసం ఎలాంటి మీసేవా కేంద్రానికి గానీ, ఆఫీసుకు గానీ వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ఉంటే స్థానిక అధికారులు, జేఎల్ ఎంలు ఇంటింటికి వచ్చి మీటర్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్ తీసుకుంటారు.
భారత్ గొప్ప విజయం.. 8 మంది నేవీ మాజీ అధికారులను విడుదల చేసిన ఖతార్.. అసలేమైందంటే ?
పథకం అమల్లోకి వచ్చిన తరువాత మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఇళ్లకు వచ్చి జీరో బిల్ తీసి ఇస్తారు. దీని వల్ల లబ్దిదారుడు ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతోంది. అందులో కూడా మహిళలు తెలంగాణలో ఎంత దూరం ప్రయాణించినా.. జీరో టిక్కెట్ జారీ చేస్తున్నారు. ఆ మహిళ ప్రయాణించిన దూరానికి ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్ మెంట్ చెల్లిస్తుంది. ఈ పథకంలో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. కుటుంబం వినియోగించిన యూనిట్లకు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రియంబర్స్ మెంట్ చెల్లించే అవకాశం ఉంటుంది.