Balka Suman: బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసుల నోటీసులు.. ఆయన స్పందన ఇదే

By Mahesh K  |  First Published Feb 12, 2024, 3:03 AM IST

సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు పంపారు. తనపై నిరాధార కేసులు పెడుతున్నదని, మాజీ సీఎం కేసీఆర్ పై రూడ్ కామెంట్లు చేసినా కాంగ్రెస్ నాయకులపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
 


BRS Party: సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి మంచిర్యాల పోలీసులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నోటీసులు పంపారు. సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై మంచిర్యాల టౌన్‌కు చెందిన పుడారి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని సెక్షన్‌లు 294(బీ), సెక్షన్ 504, సెక్షన్ 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పోలీసుల నోటీసులపై చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై నిరాధారమైన కేసులు నమోదు చేస్తున్నదని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తమ పార్టీ ఇలాంటి ఎన్నో కేసులను చూసిందని, ఈ కేసులతో తమను భయపెట్టలేరని పేర్కొన్నారు.

Latest Videos

ఇటీవలే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎంను షూతో కొడతానని బెదిరించాడు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.

Also Read: BJP: 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు.. ఐదు సెగ్మెంట్ల వివరాలు

పోలీసుల నోటీసులు వచ్చిన తర్వాత బాల్క సుమన్ స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి క్రిమినల్ అని, ఓటుకు నోటు కేసులో నిందితుడు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ విఫలమైందని చెప్పారు.

ఒక వేళ తన రూడ్ కామెంట్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేస్తే.. మాజీ సీఎం కేసీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్న కాంగ్రెస్ నాయకులపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు.

click me!