Ramoji Rao: రామోజీరావు మీడియా, సినిమా, వ్యాపార రంగాల్లో ఓ సంచలనం. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి... అనేక విజయాలు అందుకున్నారు. అనతి కాలంలో అందనంత ఎత్తుకు ఎదిగారు. ఈక్రమంలో ఆయన అనేక సినిమాలు నిర్మించారు. పలు పురస్కారాలను అందుకున్నారు.
Ramoji Rao: ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు అధినేత రామోజీరావు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా సుపరిచితులే. కఠోర శ్రమతో మీడియా రంగంలో ఎదగడంతో పాటు భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించుకున్నారు. అలాగే, ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థ ద్వారా పలు చిత్రాలు నిర్మించారు. తెలుగుదనం ఉట్టిపడేలా దాదాపు 80 సినిమాలను నిర్మించారు. ఉత్తమ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో పురస్కారాలూ అందుకున్నారు.
రామోజీ నిర్మించిన సినిమాలు..
శ్రీవారికి ప్రేమలేఖ (1984)
మయూరి (1985)
మౌన పోరాటం (1989)
ప్రతిఘటన (1987)
పీపుల్స్ ఎన్‌కౌంటర్ (1991)
అశ్వని (1991)
మెకానిక్ మామయ్య (1999)
చిత్రం (2000)
నువ్వే కావాలి (2000)
ఇష్టం (2001)
ఆనందం (2001)
ఆకాశ వీధిలో (2001)
మూడుముక్కలాట
నిన్ను చూడాలని (2001)
తుఝె మేరీ కసమ్ (2003)
వీధి (2005)
నచ్చావులే (2008)
నిన్ను కలిసాక (2009)
సవారి (కన్నద గమ్యమ్) (2009)
undefined
అందుకున్న పురస్కారాలివే...
రామోజీరావు మీడియా, సినిమా, వ్యాపార రంగాల్లో రాణించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు భాష ఉన్నతి కోసం ఎంతో కృషి చేశారు. ఇందుకు గాను రామోజీరావును అనేక పురస్కారాలు వరించాయి. 2016లో సాహిత్యం, విద్య విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ అందుకున్నారు. అలాగే, ఆంధ్ర విశ్వవిద్యాలయం(విశాఖ), శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం(తిరుపతి), శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. యుధవీర్ అవార్దు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదురి పురస్కారంతో పాటు మీడియా రంగానికి సంబంధించి బి.డి. గోయెంకా అవార్డును అందుకున్నారు.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తుదిశ్వాస విడిచారు.తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి రాజకీయ, సినీ వ్యాపార ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
జూన్ 5న శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్న రామోజీరావును కుటుంబసభ్యులు నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి స్టెంట్ అమర్చారు. అయినప్పటికి ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు... మరింత క్షీణించడంతో వెంటిలేటర్ పై వుంచి చికిత్స అందించారు.
అయితే నిన్న(శుక్రవారం) రామోజీరావు ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. చివరకు ఇవాళ(శనివారం) తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు... ఈ మేరకు రామోజీరావు కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించగా... పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి నివాళి అర్పించారు. రామోజీ ఫిలిం సిటీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.