రేవంత్ చేరికపై నోరు విప్పిన డికె అరుణ

Published : Nov 01, 2017, 02:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రేవంత్ చేరికపై నోరు విప్పిన డికె అరుణ

సారాంశం

రేవంత్ పార్టీలో చేరితే తనకు అభ్యంతరం ఏముంటదని డికె అరుణ ప్రశ్న

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు నిన్నమొన్నటి వరకు ఎదుర్కొన్నారు గద్వాల కాంగ్రెస్ నాయకురాలు డికె అరుణ. అయితే ఆమె తాజాగా రేవంత్ చేరికపై నోరు విప్పారు. అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన విషయాలతోపాటు అనేక అంశాలపై ముచ్చటించారు.  ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే చదవండి.

 

రేవంత్ రాకను నేనెందుకు వ్యతిరేకిస్తాను.

వ్యతిరేకించేవారెవరైనా ఉంటే నా పేరు చెబుతున్నారేమో!

అంతేకానీ నాకు వ్యతిరేకించాల్సిన అవసరం ఏమీ లేదు.

రేవంత్ కు పదవులు ఇవ్వద్దని నేనెందుకంటాను.

హైకమాండ్ ఇస్తామంటే వద్దనేవారెవరైనా ఉంటారా?

కొడంగల్ ఉప ఎన్నిక వస్తుందనుకోవడం లేదు.

ఆ ఎన్నిక వస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న అన్నీ స్థానాల్లో ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది.

కాదు కొడంగల్ మాత్రమే ఎన్నిక పెడతామని కేసీఆర్ అంటే జనం గమనిస్తారు.

 

అయితే గతంలో డికె అరుణ రేవంత్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నది. పలుసందర్భాల్లో ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. కానీ రేవంత్ పార్టీ మారుతున్నాడని వార్తలొచ్చిన నేపథ్యంలో పలుసార్లు రేవంత్ రెడ్డి డికె అరుణను కలిసి ఆమెతో సయోధ్య కుదుర్చుకున్నట్లు తెలిసింది. గతంలో రేవంత్, డికె అరుణ ఎంతగా ఫైట్ చేసుకున్నారో ఈ కింద ఫొటో ఉంది. ఫొటో కింద వీడియో లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వారిద్దరి విమర్శల పర్వం మీరూ చూడొచ్చు.

http://telugu.asianetnews.com/video/revanth-reddy-dk-aruna-scoldings-to-each-other

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు