దిశా నిందితుల ఎన్కౌంటర్: విధివిధానాలను ఖరారు చేసిన సుప్రీంకోర్టు

By telugu teamFirst Published Jan 18, 2020, 11:11 AM IST
Highlights

తాజాగా సుప్రీమ్ కోర్ట్ దిశా నిందితుల ఎన్కౌంటర్ నిజనిర్ధారణ కమిషన్ విధి విధానాలను స్పష్టం చేసింది. విచారణలో ఎయె అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానిపై కమిషన్ కు స్పష్టత ఇచ్చింది

దిశా నిందితుల ఎన్కౌంటర్ మీద విచారణ చేపట్టడానికి ఇప్పటికే సుప్రీమ్ కోర్ట్ జస్టిస్ సిరిపుర్కర్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కూడిన విచార కమిషన్ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా సుప్రీమ్ కోర్ట్ దిశా నిందితుల ఎన్కౌంటర్ నిజనిర్ధారణ కమిషన్ విధి విధానాలను స్పష్టం చేసింది. విచారణలో ఎయె అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానిపై కమిషన్ కు స్పష్టత ఇచ్చింది. 

ఏ పరిస్థితుల్లో ఆ ఎన్కౌంటర్ చేయవలిసి వచ్చిందనేది తేల్చి, అందులో ఎమన్నా చట్టానికి అతీతంగా పోలీసు వారు నేరానికి పాల్పడ్డారా అనేది తేల్చాలని చెప్పింది. పోలీసు వారు గనుక ఎక్కడైనా చట్టానికి అతీతంగా నడుచుకుంటే, వారిపై తగిన చర్యలు తీసుకునేవీలుంటుందని తెలిపింది. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్దే  తొ కూడిన ధర్మాసనం ఈ విధి విధానాలను ఖరారు చేసింది. 

Also read: దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే...

తొలుతగా హైదరాబాద్ కు చెందిన వెటర్నరీ డాక్టర్ దిశా హత్యచార ఘటనలో నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకింది చెన్నకేశవులు కస్టడీ లో ఉండగా ఏ కారణాల వల్ల వారిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, దానికి దారితీసిన పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయవలిసి ఉంటుంది. 

ఇక రెండో విధి విధానంగా ఆ ఎన్కౌంటర్ చేసే క్రమంలో పోలీసువారు చట్టానికి లోబడే చేశారా, లేదా ఏమైనా చట్టాన్ని అతిక్రమించి నేరానికి పాల్పడ్డారా అనే విషయాన్ని వీరు తేల్చడంతోపాటు, దానికి బాధ్యులెవరో, ఎవరెవరి పాత్ర ఎంతో కూడా తేల్చాలని తెలిపింది. 

ఒక్కో సిట్టింగ్ కు చైర్మన్ కి లక్షన్నర, మిగిలిన ఇద్దరు సభ్యులకు లక్ష రూపాయలను చెల్లించనున్నట్టు తెలిపింది. ఈ కమిషన్ సభ్యులకు విచారణ సమయంలో సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ ఏర్పాటు చేయాలనీ కూడా తెలిపింది.

Also read: ఎన్ కౌంటర్ చేయడం కాదు.. సజ్జనార్ తో అసదుద్దీన్ ట్వీట్ వార్

ఈ కమిషన్ సభ్యులంతా హైదరాబాద్ లో ఉండే విచారణ చేస్తారని, వీరి స్టాఫ్ జీతభత్యాలన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అందులో స్పష్టం చేసారు. 

దిశా నిందితులది బూటకపు ఎన్కౌంటర్ గా ఆరోపిస్తూ, ఇందులో భాగస్వాములైన పోలీసువారిని కఠినంగా శిక్షించాలని, ఇందుకోసం ఒక స్వతంత్ర విచారణ జరపాలని ఇద్దరు పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది.  

జస్టిస్ సిరిపుర్కర్, రేఖ ప్రకాష్, కార్తికేయలతో కూడిన ఈ విచారణ కమిషన్ 6నెలల్లోపు తమ నిజ నిర్ధారణ రిపోర్టును సుప్రీమ్ కు అందజేయనుంది. 

click me!