దిశ నిందితుల ఎన్ కౌంటర్: పంచనామా పూర్తి, ఘటనా స్థలానికి నిందితుల తల్లిదండ్రులు

By Nagaraju penumalaFirst Published Dec 6, 2019, 1:41 PM IST
Highlights

నలుగురి నిందితుల మృతదేహాలకు నలుగురు మెజిస్ట్రేట్లు శవపంచనామా నిర్వహించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ ఆరిఫ్ మృతదేహానికి ఫరూక్ నగర్ మెజిస్ట్రేట్ పాండు నాయక్ సమక్షంలో శవపంచనామా నిర్వహించారు వైద్యులు. 
 

హైదరాబాద్‌ : తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలోనే శవ పంచనామా నిర్వహించారు స్థానిక మెజిస్ట్రేట్. శాంతి భద్రతల దృష్ట్యా దిశ నిందితుల మృతదేహాలకు ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశంలోనే శవపంచనామా నిర్వహించారు. 

నలుగురి నిందితుల మృతదేహాలకు నలుగురు మెజిస్ట్రేట్ లు శవపంచనామా నిర్వహించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ ఆరిఫ్ మృతదేహానికి ఫరూక్ నగర్ మెజిస్ట్రేట్ పాండు నాయక్ శవపంచనామా నిర్వహించారు.  

ఇకపోతే ఏ2 నిందితుడు చెన్నకేశవులు మృతదేహానికి కొందుర్గు తహశీల్ధార్ శ్రీకాంత్ పంచనామా నిర్వహించగా ఏ3 నిందితుడు శివ మృతదేహానికి నందిగామ తహాశీల్ధార్ హైదర్ అలీ శవపంచనామా నిర్వహించారు. 

మరోవైపు ఏ4 నిందితుడు నవీన్ మృతదేహానికి చౌదరిగూడ తహాశీల్ధార్ రాముడు శవపంచనామా నిర్వహించారు. నాలుగు మృతదేహాలు 20 నుంచి 30 అడుగుల దూరంలో పడి ఉన్నాయని డీఎంఅండ్ హెచ్ వో శ్రీనివాస్ నాయక్ తెలిపారు. మృతదేహాలకు శవపంచనామా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.

అనంతరం మరికాసేపట్లో మృతదేహాలను మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. పోస్టుమార్టం కూడా ఛటాన్ పల్లి బ్రిడ్జ్ వద్దే నిర్వహించాలని భావించినా పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. 

మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి చెందిన ఐదుగురు వైద్యుల బృందం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాస్పత్రికి చేరుకున్నారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్: ఎన్ కౌంటర్ జరిగిన చోటే పోస్టుమార్టం

శవ పంచనామా అనంతరం నాలుగు మృతదేహాలను ఫరుక్‌ నగర్‌, పొందుర్గు, నందిగామ, చౌదరిగూడ తహాశీల్ధార్ లకు అప్పగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

ఇకపోతే నిందితుల స్వగ్రామం అయిన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామంలో వనపర్తి ఎస్పీ అపూర్వారావు పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా గుడిగండ్ల గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆరిఫ్ తల్లిదండ్రులు తమ ఇంటి నుంచి ఎన్ కౌంటర్ జరిగిన ఛటాన్ పల్లి బ్రిడ్జ్ వద్దుకు బయలుదేరారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్: వైఎస్ఆర్ గుర్తొచ్చారన్న వాసిరెడ్డి పద్మ
 

click me!