time line దిశ హత్య కేసు... ఎప్పుడు ఏం జరిగింది..?

By telugu teamFirst Published Dec 6, 2019, 1:39 PM IST
Highlights

యువతి 9గంటల 18 నిమిషాల ట్రీట్మెంట్ తర్వాత టోల్ ప్లాజా వద్దకు వచ్చింది. ఆమె వచ్చేసరికి స్కూటర్ పంక్చర్  అయ్యి ఉంది. దానిని అదునుగా చేసుకొని నలుగురు నిందితులు ఆమె వద్దకు వచ్చారు. స్కూటర్ పంక్చర్ అయ్యిందని చెప్పి.. తాము బాగు చేయిస్తామని నమ్మించి తాళం లాక్కున్నారు.
 

దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున దిశ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కాగా... ఈ ఘటన  పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో... అసలు డే టూ డే ఏం జరిగిందంటే...

నవంబర్ 27:
వెటర్నరీ డాక్టర్ దిశ.. సాయంత్రం 6గంటల సమయంలో టోల్ ప్లాజా వద్ద  స్కూటర్ పార్క్ చేస్తోంది. ఆ సమయంలో.. నలుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ ఉన్నారు. అప్పుడే వారి కన్ను ఆమెపై పడింది. ఆమెపై అత్యాచారం చేయాలని వారు అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఆమె అక్కడి నుంచి క్యాబ్ లో గచ్చిబౌలి వెళ్లింది. ఆమె అలా వెళ్లగానే.. వీళ్లు పథకం ప్రకారం.. నిందితుల్లో ఒకడైన నవీన్ స్కూటరీ పంక్చర్ చేశారు.


కాగా... యువతి 9గంటల 18 నిమిషాల ట్రీట్మెంట్ తర్వాత టోల్ ప్లాజా వద్దకు వచ్చింది. ఆమె వచ్చేసరికి స్కూటర్ పంక్చర్  అయ్యి ఉంది. దానిని అదునుగా చేసుకొని నలుగురు నిందితులు ఆమె వద్దకు వచ్చారు. స్కూటర్ పంక్చర్ అయ్యిందని చెప్పి.. తాము బాగు చేయిస్తామని నమ్మించి తాళం లాక్కున్నారు.

9గంటల 45 నిమిషాలకు బాధితురాలు తన సోదరికి ఫోన్ చేసి.. తన బైక్ పంక్చర్ అయ్యిందని.. లారీ డ్రైవర్లు వచ్చి ఇలా రిపేర్ చేస్తామని తీసుకువెళ్లారని చెప్పింది. తర్వాత పావుగంటకు ఆమె సోదరి మళ్లీ ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది.

ఈ మధ్యలో ఆమెను స్కూటర్ రీపేర్ చేయించామని నమ్మించి ఆమెను పిలిచారు. నమ్మి వెళ్లిన ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె సహాయం కోసం అరవడం మొదలుపెట్టగానే.. బలవంతంగా నోట్లో మద్యం పోశారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం.. ఆమెను లారీ క్యాబిన్ లోకి ఎక్కించి... శంషాబాద్ చటన్ పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్లారు. మధ్యలో కూడా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటం గమనార్హం. ఆమె అరిచిన ప్రతిసారి నోట్లో ఆల్కహాల్ పోసి స్పృహ కోల్పోయేలా చేశారు. తర్వాత చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద ఆమెను దుప్పట్లోచుట్టి... బ్రతికుండగానే పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆమె సజీవదహనమయ్యింది.

ఆ తర్వాత నిందితులు సదరు యువతి స్కూటీని ఘటన జరిగిన స్థలం నుంచి 30కిలోమీటర్ల దూరంలో వదిలేసి.. అక్కడి నుంచి పరారయ్యారు.

నవంబర్ 28..

గురువారం ఉదయం మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అది కనిపించకుండా పోయిన వెటర్నరీ డాక్టర్ గా పోలీసులు గుర్తించారు.

నవంబర్ 29..

సైబరాబాద్ పోలీసులు నిందితులు నలుగురిని అరెస్టు చేశారు. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ లు గుర్తించారు. నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తారని గుర్తించారు.

నవంబర్ 30..

నలుగురు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా... వారిని 14 రోజుల జ్యుడీషల్ కస్టడీకి తరలించారు. తర్వాత వారిని చంచల్ గూడ సెంట్రల్ జైలుకి తరలించారు. అదే రోజు సాయంత్రం యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో నిర్లక్ష్యం వహించినందుకుగాను.. ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

డిసెంబర్ 1...
తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తును సీరియస్ గా తీసుకుంది. ఫాస్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

డిసెంబర్ 6....
శుక్రవారం పోలీసులు నిందితులను తీసుకొని సీన్ రికన్ స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లారు. దిశను వాళ్లు సజీవదహనం చేసింది దాదాపు 3గంటల ప్రాంతంలో కావడంతో.. అదే సమయంలో నిందితులను అక్కడకు తీసుకువెళ్లారు. అక్కడ నిందితులు పోలీసుల వద్ద నుంచి తుపాకీలు లాక్కోవడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా రాళ్లదాడి కూడా చేశారు. ఈ క్రమంలో...పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా.. నిందితులపై కాల్పులు జరిపారు.

click me!