లైంగిక వేధింపుల కేసులో సీఐ చంద్రకుమార్ కోసం గాలింపు

Published : Aug 21, 2020, 03:01 PM IST
లైంగిక వేధింపుల కేసులో సీఐ చంద్రకుమార్ కోసం గాలింపు

సారాంశం

మహిళను లైంగికంగా వేధించిన కేసులో స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


మహిళను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో సీఐ చంద్రకుమార్ పై నాలుగు రోజుల క్రితం కేసు నమోదైంది.  మహిళ ఫిర్యాదు మేరకు సీఐను  సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.

కేసు నమోదై నాలుగు రోజులైనా కూడ  చంద్రకుమార్ ను అరెస్ట్్ చేయకపోవడంతో బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వనస్థలిపురం పోలీసులపై తనకు నమ్మకం లేదని కూడ ఆమె బహిరంగంగానే వ్యాఖ్యానించింది.

చంద్రకుమార్ పై ఛీటింగ్  తో పాటు నిర్భయ కేసు నమోదయ్యాయి.  సీఐ చంద్రకుమార్  కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. చంద్రకుమార్ ఫోన్ స్విచ్ఛాప్ చేసుకొని పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

మహిళను వేధించడంతో పాటు నగ్నంగా ఆ మహిళకు చంద్రకుమార్ ఫోన్ చేసినట్టుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది. తన కోరిక తీర్చాలని వేధింపులకు కూడ పాల్పడినట్టుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది.

అయితే ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె తొలుత ఆరోపించింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో  సీఐ చంద్రకుమార్ ను సస్పెండ్ చేశారు.  చంద్రకుమార్ పై కేసు నమోదు కావడంతో ఆయన పరారీలో ఉన్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu