మేడారం జాతర (medaram jatara 2024) లో ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యారు. క్యూలైన్ లో నిలబడిన సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అక్కడే ఉన్న రెస్క్యూ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ఆయనను రక్షించారు. తరువాత హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
ములుగు జిల్లాలో ఉన్న మేడారం జాతర ఘనంగా ప్రారంభమైంది. నేటి ఉదయమే లక్మీపూరం నుండి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. సంప్రదాయ పద్దతిలో గిరిజనులు స్వాగతం పలికారు. భారీ బందోబస్త్ మధ్య ఈ శోభయాత్ర సాగింది. ఈ జాతర కోసం తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.
ఎక్కడా తగ్గని రైతులు.. ఢిల్లీ ముట్టడికి సిద్ధం.. మళ్లీ చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
జాతరకు విచ్చేసిన భక్తుల కోసం క్యూలైన్ లు ఏర్పాటు చేశారు. అయితే ఈ క్యూలైన్ లో నిలబడిన పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీనిని అక్కడే ఉన్న రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. వెంటనే అలెర్ట్ అయ్యారు.
గుండెపోటుకు గురైన భక్తుడిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది..
పెద్దపల్లి జిల్లా - రాజు అనే వ్యక్తి మేడారం జాతర క్యూ లైన్‌లో గుండెనొప్పితో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడడం గుర్తించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి ముందుగా కృతిమ శ్వాస అందించి స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. pic.twitter.com/vTlD1MaRLA
రాజును క్యూలైన్ నుంచి పక్కకు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. కృతిమ శ్వాస అందించి ఆయనకు కాస్తా ఉపషమనం కలిగేలా చేశారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయనను మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.
ప్రముఖ న్యాయ నిపుణుడు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కన్నుమూత..
ఇదిలా ఉండగా.. మేడారం జాతర నేపథ్యంలో భక్తులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం.’’ అని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.